ఏటీఎంలో చోరీ, ఇద్దరు సిబ్బందిని దారుణంగా కాల్చివేశారు
National
oi-Nageshwara
By Nageswara Rao
లక్నో: శుక్రవారం ఉదయం లక్నోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంను కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. భద్రతా సిబ్బంది ఏటీఎంలో నగదు పెడుతుండగా దుండగులు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఇద్దరు అధికారులు మృతి చెందారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హఠాత్తుగా ఏటీఎం వద్దకు వచ్చి కాల్పులు జరిపి ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు స్ధానికులు వెల్లడించారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.