"అది ఇస్లాంపై దాడే"- అలహాబాద్ హైకోర్టు తీర్పుపై ఓవైసీ ఫైర్..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పాఠశాలలో హిజాబ్ ధరించేందుకు తనకు అనుమతి నిరాకరించడంపై ఓ బాలిక అలహాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. హిజాబ్ ధారణ ఇస్లాంలో భాగం కాదని తేల్చిచెప్పేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ముస్లింలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కూడా అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టారు.
పాఠశాలలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ ఒక ముస్లిం బాలిక దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇస్లాంపై దాడిగా అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. ఇస్లాంకు ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించే అధికారం న్యాయమూర్తులకు లేదని ఒవైసీ అన్నారు. ఇది మా మతం, ఏది అవసరమో మేమే నిర్ణయిస్తాం, నిర్ణయించడానికి న్యాయమూర్తులు ఎవరు? ఇది మా మతంపై దాడి అని ఒవైసీ విమర్శించారు. విద్యాసంస్థలు నిర్దేశించిన దుస్తుల నియమావళిని వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే హక్కు ఏ విద్యార్థికీ లేదని అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించడానికి అనుమతించాలని పాఠశాల అధికారులను ఆదేశించాలని కోరుతూ ఒక విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆ బాలిక ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి, అదే విద్యాసంస్థలో పదకొండవ తరగతిలో ప్రవేశం కోరుతోంది.

హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఒక ముఖ్యమైన ఆచారం అనే వాదనను జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. ఈ సమస్య ఎక్కడ తలెత్తినా, మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం మతంలో తప్పనిసరి భాగం కాదని, అది ధరించకపోతే మత విశ్వాసానికి భంగం కలుగుతుందని హైకోర్టులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డాయని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై స్పందించిన ఓవైసీ.. శబరిమలకు సంబంధించిన తప్పనిసరి మతపరమైన ఆచారాల విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే విచారిస్తోందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని విచారిస్తున్నప్పుడు, అలహాబాద్ న్యాయమూర్తులు ఈ విషయంపై తీర్పు ఇచ్చి ఉండకూడదన్నారు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వు రాజ్యాంగంలోని 19, 25 అధికరణలకు విరుద్ధంగా ఉందన్నారు. ఆమె తలకు హిజాబ్ ధరిస్తోంది, మనసుకు కాదని తెలిపారు.














Click it and Unblock the Notifications