ఇకపై ఆగస్టు 14 ‘విభజన గాయాల స్మారక దినం’: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకే ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇకపై ఆగస్టు 14న 'విభజన గాయాల స్మారక దినం'గా జరుపుకుందామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
విభజన బాధను ఎప్పటికీ మర్చిపోలేం. భారత్, పాక్ విభజనతో లక్షలాది మంది సోదర సోదరీమణులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆనాడు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారి సంఘర్షణ, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 14ను విభజన గాయాల స్మారక దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

అంతేగాక, వివక్ష, శత్రుత్వం, దుర్మార్గం అనే విషాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు మనకు పదే పదే గుర్తు చేస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఐక్యత, సామాజిక సామరస్యం, మానవ సాధికారతను మరింత బలోపేతం చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
వాఘా బోర్డర్‌లో స్వీట్స్ పంచుకున్న భారత్-పాక్ స్వీట్లు
బ్రిటీషర్ల నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన అనంతరం ఆగస్టు 15న భారత్ నుంచి విడిపోయిన కొంత భూభాగం పాకిస్థాన్ పేరుతో మరో దేశంగా ఆవిర్భవించింది. అయితే, భారత్ కంటే ఒక రోజు ముందుగానే.. ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చేసుకుంటోంది. ఇక ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతుంది.
శనివారం పాకిస్థాన్ స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్బంగా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత్-పాకిస్థాన్ జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈరోజు పాక్ సోదరులు వారి స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా మాకు స్వీట్లు పంచారు. రేపు మనదేశపు స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా మేం వారికి మిఠాయిలు పంచుతామని బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ తెలిపారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో చాలా సందర్భాల్లోనూ ఉద్రిక్తంగా ఉంటాయి. ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అనుక్షణం వేయి కళ్లతో కావలికాస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తుపాకుల కాల్పులు, మోర్టార్ల ప్రయోగాలతో దేశ సరిహద్దులు దద్దరిల్లిపోతుంటాయి. పాక్ కవ్వింపు చర్యలకు భారత జవాన్లు తగినవిధంగా బుద్ధి చెబుతుంటారు. అయితే, ఈ రోజు మాత్రం సరిహద్దుల వద్ద ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పంజాబ్ బోర్డర్‌లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ మాట్లాడుతూ.. రేపు మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్ జవాన్లకు స్వీట్లు బహుమతిగా ఇస్తామని తెలిపారు. 1947 ఆగస్ట్ 14న అఖండ భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. అయితే, పాక్ మన కంటే ఒక్కరోజు ముందుగానే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.
Recommended Video
ఆగస్టు 15న మనం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. రేపటి ఆగస్టు 15 నాటికి మనకు స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో భారత్ ఈ ఏడాది పొడవున అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే చాలా మంది యువత స్వచ్చంద సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి.రేపు అంటే ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ మన జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.












Click it and Unblock the Notifications