అగస్టా వెస్ట్‌లాండ్: నరసింహన్‌ను సీబీఐ ప్రశ్నించే ఛాన్స్

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ డీల్‌కు సంబంధించిన అంశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్ డీల్‌కు సంబంధించి సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నరసింహన్‌ను ప్రశ్నించే అవకాశముంది.

ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన విషయంలో ఇద్దరు గవర్నర్లను ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణ, గోవా గవర్నర్ బీవీ వాంచూను ప్రశ్నించింది. ఇప్పుడు నరసింహన్‌ను ప్రశ్నించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. నరసింహన్‌ను సాక్షిగా విచారించనున్నారు.

AugustaWestland deal: CBI to examine Governor Narasimhan

కాగా, గతంలో ఇద్దరు గవర్నర్లను అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు నరసింహన్‌ను ప్రశ్నించే అవకాశముంది. గతంలో సీబీఐ విచారించిన ఇద్దరు గవర్నర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నరసింహన్ కూడా రాజీనామా చేస్తారా అనే చర్చ సాగుతోంది.

హెలికాప్టర్ల కొనుగోలు కోసం సంబంధించి అధికారులు సాంకేతికపరమైన వివరాలు తీసుకున్న సమయంలో నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్‌గా ఉన్నారు. నారాయణ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్‌గా ఉన్నారు. అలాగే బీవీ వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ హెడ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో నరసింహన్‌ను విచారించనున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+