student: అర్దరాత్రి అత్తను చంపిన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, అడ్డువెళ్లిన మామను ?, క్లైమాక్స్ లో !

చెన్నై/ తిరువళ్లూరు: చాలా దగ్గర బంధువులు అయిన రెండు కుటుంబాలు ఒకే ఊరిలో ఉంటున్నారు. ఓ కుటుంబంలోని వ్యక్తి అధికార పార్టీ నాయకుడిగా పని చేస్తున్నాడు. రాజకీయ నాయకుడి కుమారుడు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రెండు కుటుంబాల మద్య ఆస్తితగాదాలు ఉన్నాయి. అర్దరాత్రి ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అతని స్నేహితులతో కలిసి మద్యం సేవించి రోడ్డు మీద నానా హంగామా చేశారు. ఆ సందర్బంలో ఇంజనీరింగ్ విద్యార్థి ఇనుపరాడ్ తీసుకుని అతని అత్త, మేనమామ మీద దాడి చేశాడు. తీవ్రగాయాలైన మేనమామ భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

పొలిటికల్ లీడర్ కొడుకు

పొలిటికల్ లీడర్ కొడుకు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కనికైబర్ గ్రామంలో శక్తివేల్ (52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఎల్లాపురం ప్రాంతానికి చెందిన డీఎంకే యూనియన్ కార్యదర్శిగా శక్తివేల్ పని చేస్తున్నాడు. అధికార పార్టికి చెందిన శక్తివేల్ కు ఆ ప్రాంతంలో మంచిపలుకుబడి ఉంది. శక్తివేల్ కుమారుడు విశాల్ (20) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

మద్యం మత్తులో హంగామా

మద్యం మత్తులో హంగామా

విశాల్ తన స్నేహితులతో కలిసి డిసెంబర్ 31వ తేదీ అర్దరాత్రి కేక్ కట్ చేసి, తన వీధిలో క్రాకర్స్ పేల్చి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నాడు. పదిమందికి పైగా విశాల్ స్నేహితులు మద్యం మత్తులో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అర్థరాత్రి దాటినా విశాల్ తో పాటు అతని స్నేహితులుయువకులు మద్యం మత్తులో వీధిలో కేకలు వేస్తూ నానా హంగామా చేశారు.

అభ్యంతరం చెప్పిన మేనమామ ఫ్యామిలీ

అభ్యంతరం చెప్పిన మేనమామ ఫ్యామిలీ

అదే ప్రాంతంలో నివసించే విశాల్ ముత్తాత కుమారుడు మురుగన్ (విశాల్ మేనమామ), అతని భార్య రమ్యా, పెరియమ్మ, సెల్వీ తదితరులు విశాల్‌ చేస్తున్న పనులను ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే ఆస్తి తగాదాలు ఉండటంతో ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్భంలో అప్పటికే పీకలదాక మద్యం సేవించి ఉన్న విశాల్ అతని స్నేహితులు మురుగన్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు.

ఇనుపరాడ్ తో అత్తను చితకబాదేశాడు

ఇనుపరాడ్ తో అత్తను చితకబాదేశాడు

ఒక్కసారిగా మద్యం మత్తులో విశాల్ పక్కనే ఉన్న ఇనుప రాడ్ తీసుకుని అతని మేనమామ మురుగన్, ఆయన భార్య రమ్యా, అతని అమ్మమ్మ సెల్వీలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. విశాల్ దాడితో రమ్యా తలకు బలమైన గాయమై రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. వెంటనే రమ్యాను, తీవ్రగాయాలైన ఆమె భర్త మురుగన్, విశాల్ అమ్మమ్మ సెల్వీలకు తీవ్రగాయాలైనాయి

అత్త ప్రాణం పోయింది..... అల్లుడు ఎస్కేప్

అత్త ప్రాణం పోయింది..... అల్లుడు ఎస్కేప్

మద్యం కిక్కు దిగిపోవడంతో విశాల్ అక్కడి నుంచి పారిపోయాడు. మురుగన్, సెల్వీలకు తీవ్ర గాయాలయాలు కావడంతో వారు కేకలు వేశారు. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. విశాల్ దాడిలో అతని అత్త రమ్యా ప్రాణాలు పోయాయి. పెరియపాళయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమ్యాను హత్య చేసిన విశాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అల్లుడి చేతిలో అత్త హత్యకు గురికావడం, ఊరిలో అందరూ బంధువులే కావడం, అమ్మమ్మ మీద కూడా విశాల్ దాడి చెయ్యడంతో రెండు కుటుంబాల మద్య గొడవలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+