Aunty: సింగిల్ స్కెచ్ తో రూ. 50 లక్షలు లాగేసిన భాను ఆంటీ, స్వర్గం చూపించి?, రూ. 4 కోట్ల ప్లాన్ !

బెంగళూరు/మండ్య: బంగారు నగల వ్యాపారం చేస్తున్న వ్యక్తి సొంతంగా జ్యువెలర్స్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. సిటీలో జ్యువెలర్స్ షోరూమ్ యజమానికి మంచి పేరు ఉంది. చుట్టుపక్కల జిల్లాల జ్యువెలర్స్ షోరూమ్ యజమానులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాత్రి ఊరికి వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ సందర్బంలో పరిచయం ఉన్న ఆంటీ ఆమె స్నేహితులు మా దగ్గర బంగారు బిస్కెట్ లు ఉన్నాయని, మీరు వచ్చి చూడాలని బలవంతంగా అతన్ని కారులో మైసూరులోని ఓ లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లారు. అక్కడ ఆంటీతో పాటు మరో అమ్మాయి జ్యువెలర్స్ షోరూమ్ యజమానికి స్వర్గం చూపించారు. స్వర్గంలో తేలుతున్న జ్యువెలర్స్ యజమానికి కొన్ని నిమిషాల్లోనే ఇద్దరు కిలాడీలు లేడీలు సినిమా చూపించారు. సింగిల్ స్కెచ్ తో జ్యువెలర్స్ షోరూమ్ యజమాని దగ్గర రూ. 50 లక్షలు లూటీ చేశారు. మరో రూ. 50 లక్షలు లాక్కోవడానికి టార్చర్ పెట్టడంతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.

 మండ్యలో ఫేమస్ బంగారు నగల వ్యాపారి

మండ్యలో ఫేమస్ బంగారు నగల వ్యాపారి

కర్ణాటకలోని మండ్య సిటీలో జగన్నాథ్ శెట్టి అనే బంగారు నగల వ్యాపారి నివాసం ఉంటున్నాడు. బంగారు నగల వ్యాపారం చేస్తున్న జగన్నాథ్ శెట్టికి సొంతంగా జ్యువెలర్స్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. మండ్యలో జ్యువెలర్స్ షోరూమ్ యజమాని జగన్నాథ్ శెట్టికి మంచి పేరు ఉంది. మండ్యతో పాటు చుట్టుపక్కల ఉన్న మైసూరు, రామనగర తదితర జిల్లాల్లోని జ్యువెలర్స్ షోరూమ్ యజమానులతో జగన్నాథ్ శెట్టికి మంచి సంబంధాలు ఉన్నాయి.

 రాత్రి ఏం జరిగిందంటే ?

రాత్రి ఏం జరిగిందంటే ?

రాత్రి మంగళూరు వెళ్లడానికి జగన్నాథ్ శెట్టి మండ్య సిటీ బస్ స్టాండ్ సమీపంలోకి వెళ్లాడు. ఆ సందర్బంలో మండ్యలో నివాసం ఉంటున్న సల్మాభాను అలియాస్ భాను అనే మహిళతో పాటు నలుగురు వ్యక్తులు కారులో వెళ్లారు. మేము మైసూరు వెలుతున్నామని, మీకు అక్కడి వరకు డ్రాప్ ఇస్తామని జగన్నాథ్ శెట్టిని నమ్మించారు.

 బలవంతంగా పిలుచుకుని వెళ్లి ?

బలవంతంగా పిలుచుకుని వెళ్లి ?

మొదట జగన్నాథ్ శెట్టి సల్మాభానుతో పాటు కారులో వెళ్లడానికి అంగీకరించలేదు. అయితే సల్మాభానుతో పాటు నలుగురు వ్యక్తులు జగన్నాథ్ శెట్టిని బలవంతంగా మైసూరుకు కారులో పిలుచుకుని వెళ్లారు. ఆ సందర్బంలో పరిచయం ఉన్న సల్మాభాను ఆంటీ ఆమె స్నేహితులు మా దగ్గర బంగారు బిస్కెట్ లు ఉన్నాయని, మీరు వచ్చి చూడాలని చెప్పారు.

 స్వర్గం చూపించారు

స్వర్గం చూపించారు

మరోసారి వచ్చి చూస్తానని జగన్మాథ్ శెట్టి చెప్పినా బలవంతంగా జగన్నాథ్ శెట్టిని కారులో మైసూరులోని ఓ లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లారు. తరువాత సల్మాభాను జగన్నాథ్ శెట్టితో ఏకాంతంగా గడిపింది. ఆ సందర్బంలో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గరు మొబైల్ లో వీడియో తీశారు. కొంతసేపటి తరువాతమ రో యువతి, మరో ఇద్దరు వ్యక్తులు లాడ్జ్ లోకి వెళ్లారు.

 రూ. 4 కోట్లు డిమాండ్

రూ. 4 కోట్లు డిమాండ్

ఆ యువతి కూడా జగన్నాథ్ శెట్టితో ఏకాంతంగా గడిపింది. తరువాత ఇద్దరు కిలాడీ లేడీలు అసలు సినిమా చూపించారు. మర్యాదగా రూ. 4 కోట్లు ఇవ్వకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, నీ జ్యువెలర్స్ షోరూమ్ మూతపడేలా చేస్తామని జగన్నాథ్ శెట్టిని బ్లాక్ మెయిల్ చేశారు. సింగల్ స్కెచ్ తో సల్మాభాను సినిమా చూపించడంతో జగన్నాథ్ శెట్టి హడలిపోయాడు.

 రూ. 50 లక్షలు ఇచ్చినా వదల్లేదు

రూ. 50 లక్షలు ఇచ్చినా వదల్లేదు

ఏం చెయ్యాలో దిక్కుతెలీక జగన్నాథ్ శెట్టి సల్మాభాను అండ్ టీమ్ కు రూ. 50 లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. క్లోజ్ ఫ్రెండ్, ఎల్ఐసీ డెవలప్ మెంట్ అధికారి శ్రీనివాసశెట్టికి ఫోన్ చూసి రూ. 25 లక్షలు, మైసూరులోని సూర్య జువలర్స్ యజమానికి ఫోన్ చేసి రూ. 23 లక్షలు, మైసూరులోని కల్పతరు సిల్వర్ హౌస్ నుంచి రూ. 2 లక్షలు తెప్పించిన జగన్నాథ్ శెట్టి కిలాడీ లేడీ సల్మాభాను అండ్ టీమ్ కు ఇచ్చాడు.

 టార్చర్ పెట్టి తగులుకున్నారు

టార్చర్ పెట్టి తగులుకున్నారు

జ్యువెలర్స్ షోరూమ్ యజమాని జగన్నాథ్ శెట్టి నుంచి రూ. 50 లక్షలు తీసుకున్న తరువాత ఇంకా డబ్బులు కావాలని సల్మాభాను ఆమె స్నేహితులు టార్చ్ పెట్టారు. వీళ్ల టార్చర్ తట్టుకోలేని జగన్నాథ్ శెట్ి మండ్య వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. హనీట్రాప్ కేసులో మండ్య నివాసి సల్మాభానును ఇద్దరిని అరెస్టు చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+