మోడీని చంపేందుకు అబూ జిందాల్ కుట్ర : వాస్తవమేన్న ముంబై కోర్టు

ముంబై : 2002లో గుజరాత్ అల్లర్ల తరువాత అప్పట్లో రాష్ట్రానికి సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని అలాగే విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాలను హత్య చేసేందుకు కుట్ర జరిగిన మాట వాస్తవమేనని పేర్కొంది ముంబై మోకా కోర్టు (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్).

అబూ జిందాల్ అలియాస్ సయ్యద్ జుబేదిన్ అన్సారీ ఈ హత్యలకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై విచారణ జరిపిన ముంబై మోకా కోర్టు విషయాన్ని ధృవీకరించింది. ఆరోపణలు వాస్తవమేనని మోడీ, తొగాడియాల హత్యకు అబూ జిందాల్ కుట్ర పన్నాడని తెలిపింది.

Aurangabad Arms Haul Case: Abu Jundal conspired to kill Narendra Modi, others after 2002 Gujarat riots, says Court

అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ నిందితులుగా భావించలేమని, ప్రధాన నిందితుడు అబూ జిందాల్ తో పాటు మరో వ్యక్తి మాత్రమే కుట్రతో సంబంధం కలిగి ఉన్నాడని కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో 30 కేజీల ఆర్డీఎక్స్, 10 ఏకే 47 తుపాకులను, 3200 బుల్లెట్లను తరలిస్తూ ఏటీఎస్ పోలీసులకు కంటపడ్డ జిందాల్, వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యాడు.

అనంతరం మాలేగావ్ మకాం మార్చిన జిందాల్, అక్కడి నుంచి బంగ్లాదేశ్ కు తర్వాత పాక్ కు పారిపోయాడు. అయితే 2012లో సౌదీ అరేబియాలో మళ్లీ పట్టుబడడంతో.. సౌదీ ఇండియా మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు అబూ జిందాల్ అతని సహచరి మోనికా బేడీలను ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+