అమ్మాయిలు అతని ఆటో ఎక్కితే అంతే: వీడియోలు తీసి..

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: మహిళలు, అమ్మాయిల పట్ల కొందరు క్యాబ్, ఆటో డ్రైవర్ల తీరు మారడం లేదు. మహిళా ప్రయాణికులు క్యాబ్, ఆటోల్లో ఎక్కితే చాలు వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ఏకంగా తన ఆటోలో ఎక్కిన అమ్మాయిలు వీడియోలను తీశాడు. అది కూడా వారికి తెలియకుండా. అయితే, అతని పాపం పండి ఓ అమ్మాయికి దొరికపోవడంతో కటకటాల పాలయ్యాడు.

ఆ వివరాల్లోకి వెళితే.. ఆ ఆటో డ్రైవర్ పేరు రంజిత్. చూసేందుకు బుద్ధిమంతుడిలా కనిపించిన చేసేవాన్ని సిగ్గుమాలిన పనులే. అమ్మాయిలను ఆటోలో ఎక్కించుకుని వారిని అద్దంలో నుంచి దొంగచూపులు చూడటం, రహస్యంగా వీడియోలు తీయడం ఇతని అలవాటు. అది కూడా తన మహిళా ప్రయాణికులకు తెలియకుండానే. అంతేగకా, అతడు తీసిన వీడియోలను పదేపదే చూస్తూ, తన స్నేహితులకు చూపిస్తూ వికృతానందం పొందేవాడు.

Auto driver in Bangalore films woman

ఆటోపైభాగంలో సరిగ్గా సీటులో కూర్చున్న వారు కనిపించేలా ఎవరికీ కనిపించకుండా స్మార్ట్‌ఫోన్ ఒకటి అమర్చాడు. ఆ స్మార్ట్‌ఫోన్ వీడియో రికార్డర్ కస్టమర్లు ఎక్కే సమయానికి ఆన్ చేసేవాడు. అమ్మాయిలు ఆటో ఎక్కగానే వారు కూర్చున్న దగ్గర్నుంచి ఆటో దిగే దాకా వారి కదలిక రికార్డ్ చేసేవాడు. అయితే, ఓ యువతిని ఇతని గుట్టును బట్టబయలు చేసింది.

ఎలాగంటే.. జులై 24వ తేదీ ఆ యువతి తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి తిరిగి వెళ్లడానికి బయల్దేరింది. సాయంత్రం 4.30 దాటినా వర్షం తగ్గకపోవడం, క్యాబ్స్ అందుబాటులో లేకపోవడంతో అటుగా వస్తున్న రంజిత్ ఆటోను ఆపింది. వెంటనే ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు రంజిత్. ఆటో ఎక్కిన కొద్దిసేపటికి అతను అద్దంలో ఆమెను చూసి వెనక్కి తిరిగి నవ్వాడు.

దీంతో ఆ యువతికి అతనిపై అనుమానం కలిగింది. ఆటో కొంతదూరం వెళ్లగానే స్పీడ్ బ్రేకర్ల ధాటికి ఏదో వస్తువుపై నుంచి ఆ యువతి కాళ్ల దగ్గర పడింది. తీరా చూస్తే అది సెల్‌ఫోన్. వీడియో మోడ్ ఆన్ చేసి ఉన్న ఆ మొబైల్ చూసి యువతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతని మోసాన్ని పోలీసులకు చెప్పాలనుకుంది. వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.

కానీ, ఆ ఆటోడ్రైవర్ ఆమె పట్టుకున్న ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ వీడియో సేవ్ కాకుండా డిలీట్ అయ్యింది. అయితే తన ఫ్రెండ్ రావడంతో సదరు యువతి అతని బారినుంచి తప్పించుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ఆటో డ్రైవర్ రంజిత్ కటకటాలపాలయ్యాడు. రంజిత్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలాంటి వెధవలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో మంచి పని చేశావంటూ నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Days after an Ola driver was arrested for allegedly filming a passenger in Delhi, similar incident happened in Bangalore. A woman in the city caught her auto driver recording her moves on a phone taped on top of the vehicle.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి