అమానుషం :పిల్లలను హతమారుస్తామని వివాహితపై అత్యాచారం
పిల్లలను హత్య చేస్తానని బెదిరించి ఓ ఆటోడ్రైవర్ ఓ వివాహితపై అత్యాచారం చేశాడు . ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగుళూరు: ఓ మహిళపై కన్నేసిన నిందితుడు ఆమె పిల్లలను హత్య చేస్తానని బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి సమీపంలోని తాజ్ సుల్తాన్ పురం ప్రాంతంలో భర్త, పిల్లలతో కలిసి బాధితురాలు నివాసం ఉంటుంది.
ఇంటింటికి తిరిగి దుస్తుల్ని విక్రయిస్తూండేది బాధితురాలు. వ్యాపారం ఇంటికి వచ్చే సమయంలో అప్పుడప్పుడూ శరణప్ప ఆటోలో ఆమె ఇంటికి వెళ్ళేది.
ఈ పరిచయంతో ఆమె నెంబర్ తీసుకొన్నాడు శరణప్ప.ఆమె కుటుంబ విషయాలను తెలుసుకొన్నాడు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని ఆమెను వేధించసాగాడు.

తనకు లైంగికంగా సహకరించాలని ఆమెపై ఒత్తిడితెచ్చేవాడు .పరువు, మర్యాదలకు భయపడి ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.
తన కోర్కె తీర్చకపోతే పిల్లలను హత్య చేస్తానని శరణప్ప ఆమెను బెదిరించాడు.అయితే శుక్రవారం రాత్రి పూట ఆమెను తన ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడని శరణప్పపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం కలబురిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications