ఆటోలో బాలికపై డ్రైవర్ లైంగిక దాడి.. బాలిక ఏం చేసిందంటే.. షాకింగ్ వీడియో!!

మహిళలు, బాలికల కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. కానీ తమపై దాడి జరుగుతుందని గుర్తించిన బాలికలు, మహిళలు సమయస్పూర్తి ప్రదర్శిస్తే వారు లైంగిక దాడుల నుండి బయటపడవచ్చు అని నిరూపించింది మహారాష్ట్రకు చెందిన ఒక మైనర్ బాలిక. ఇంతకీ ఏం జరిగిందంటే

ఆటోలో బాలికపై లైంగిక దాడి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఒక ఆటోలో ప్రయాణిస్తున్న మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన సదరు బాలిక తనను కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం తో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉస్మాన్ పురా ప్రాంతంలో ఒక మైనర్ బాలిక తన ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కింది. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటో డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్ బాలికతో అసభ్యంగా మాట్లాడటం, ప్రవర్తించటం ప్రారంభించాడు. బాలిక ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకోకుండా అతను బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు.

ఆటో నుండి దూకేసిన బాలిక... ఆస్పత్రిలో చేరిక

ఆటో నుండి దూకేసిన బాలిక... ఆస్పత్రిలో చేరిక

దీంతో ఏం చేయాలో అర్థం కాని బాలిక అతని నుంచి తప్పించుకోవడానికి వేగంగా వెళుతున్న ఆటోలోనుండి దూకేసింది. ఇక ఈ దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. ఇక రోడ్డుపై పడిపోయిన బాలికకు గాయాలయ్యాయి. ఆటోలో నుండి బాలిక పడిపోవడంతో వెంటనే కొందరు వాహనదారులు ఆగి ఆమెకు సహాయం అందించారు. గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారాన్ని అందించారు.

 పోలీసులతో లైంగిక దాడి గురించి చెప్పిన బాలిక.. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

పోలీసులతో లైంగిక దాడి గురించి చెప్పిన బాలిక.. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

ఇక బాలిక ఆటోలో తనపై జరిగిన లైంగిక దాడి గురించి పోలీసులకు చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అయితే బాలిక ఆటోలో నుంచి కిందకు దూకినప్పటికీ డ్రైవర్ మాత్రం ఆటోను కనీసం ఆపకుండా అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలికను ప్రశంసిస్తున్న పలువురు.. ఆటో నుండి దూకి బాలిక సాహసం

బాలికను ప్రశంసిస్తున్న పలువురు.. ఆటో నుండి దూకి బాలిక సాహసం

ఇక ఈ లైంగిక దాడి నుండి సాహసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన బాలికను అందరూ ప్రశంసిస్తున్నారు. చిన్న చిన్న గాయాలు తగిలినప్పటికీ బాలిక కిందకు దూకి తనను కాపాడుకునే ప్రయత్నం చేయడంతో ఆమె ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఆటోడ్రైవర్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+