వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవార్డు వాపస్ చేసేవాళ్లకు దేశభక్తి లేదు: బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా తమకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేందుకు కొందరు ప్రముఖలు సిద్ధమైన నేపథ్యంలో మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతులకు మద్దతుగా అవార్డులను వెనక్కి ఇచ్చేవారు నిజమైన దేశ భక్తులు కాలేరని మంత్రి కమల్ పటేల్ స్పష్టం చేశారు. భారత మాతపై నిందలు వేసేవారికి, దేశాన్ని ముక్కలు చేయాలన్న వారికి గతంలో అవార్డులు వచ్చాయంటూ సంచలన ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఇలాంటి అవార్డు గ్రహీతలు, మేధావులు ప్రస్తుతం వాటిని వెనక్కి ఇస్తున్నారని, వారు నిజమైన దేశ కాందంటూ విమర్శించారు.

 Award Winners Not Patriots: Madhya Pradesh Minister on award wapsi issue

దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రైతులు భారీ ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ భారత్ బంద్‌కు పలు వ్యవసాయ సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాగా, కొందరు ప్రముఖులు తమకు వచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేసి రైతులకు మద్దతు తెలుపుతున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. కాంగ్రెస్, ఆప్, టీఆర్ఎస్ ఇతర పార్టీలు ఈ బంద్‌లో పాల్గొంటున్నట్లు తెలిపాయి.

ఇది ఇలావుండగా, రైతుల ఆందోళనలు, భారత్ బంద్ నేపథ్యంలో ప్రధాని మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంగళవారం నిర్వహించిన ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టు వర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు.

దేశంలో కొత్త చట్టాలు తెచ్చి అభివృద్ధి చేసేందుకు సంస్కరణలు ఎంతో అవసరమని అన్నారు. గత శతాబ్ధంలో తయారు చేసిన చట్టాలతో మనం నవ శకాన్ని నిర్మించలేమని ప్రధాని వ్యాఖ్యానించారు. గత శతాబ్ధంలో మంచిగా ఉపయోగపడిన చట్టాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో భాగంగా మారాయన్నారు. కాబట్టి సంస్కరణలు చేపట్టడం ఎంతో ఆవశ్యకమని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం పూర్తిగా సంస్కరణలను ప్రోత్సహిస్తోందని ప్రధాని చెప్పారు.

English summary
A BJP leader and minister in Madhya Pradesh today said "those abusing mother India and dividing the country" were honoured with national awards, in a bizarre attempt to criticize winners who have been returning their awards in support of the farmers protesting near Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X