యాక్సిస్ బ్యాంక్ బంపర్ ఆఫర్: గృహ రుణాలపై రూ. 3 లక్షల తగ్గింపు

యాక్సిస్ బ్యాంక్ గృహ నిర్మాణం కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.రూ.30 లక్షల రుణంపై రూ.3 లక్షల తగ్గింపుఈ మేరకు యాక్సిస్ బ్యాంక్ ట్విట్టర్‌లో ప్రకటించింది.

ముంబై: యాక్సిస్ బ్యాంక్ కొత్త గృహ రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.గృహ రుణ మార్కెట్‌లో ఎక్కువ మార్కెట్ వాటాను సంపాదించేందుకు గుడ్ క్రెడిట్ అవార్డ్ కోసం 'శుభ్ ఆరంభ్' పేరిట కొత్త గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది.

రూ. 30 లక్షల రుణంపై దాదాపుగా 3 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ చేస్తోంది. అంటే 20 ఏళ్ళకు సంబంధించిన రుణాలపై ఈఎంఐలను రద్దుచేస్తోంది. అయితే ఫ్లోటింగ్ రుణ పథకం కింద వడ్డీ రేటు మాత్రం స్థిరంగా 8.35 శాతంగానే కొనసాగుతోంది.

Axis Bank To Waive Off 12 EMIs On Home Loans Under 'Shubh Aarambh' Scheme

దీంతో పాటు అర్హులైన వారు ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం అందిస్తోన్న మినహయింపును కూడ పొందవచ్చని బ్యాంక్ ప్రకటించింది.

యాక్సిస్ బ్యాంక్ ట్విట్టర్‌లో ఈ మేరకు ప్రకటించింది. కొత్త రుణం చెల్లింపు వ్యవధిలో కొన్ని నెలవారీ వాయిదా చెల్లింపులకు మినహయింపు లభించేలా ఈ పథకాన్ని రూపొందించింది. 4,8, 12వ, సంవత్సరం చివర్లో సంవత్సరానికి 4 నెలసరి వాయిదాల చొప్పున రద్దుచేస్తోంది.ఇలా 20 ఏళ్ళ వ్యవధికి రుణం తీసుకొన్న వారికి మొత్తం మీద 12 ఈఎంఐల మేర ప్రయోజనం కష్టమర్లకు లభించనుంది.

ఈ కొత్త పథకం ద్వారా సుమారు రూ. 30 లక్షల రుణంపై మొత్తం మీద రూ. 3.09 లక్షల మేర ఆదా అవుతోందని బ్యాంక్ ప్రకటించింది. ఈ పథకం వర్తిస్తోందని రుణ చెల్లింపు వ్యవధి తగ్గింపు రూపంలో ఈ ప్రయోజనం అందించనున్నట్టు ప్రకటించింది.అంతేకాదు ఈ ఏ ఒక్క ఈఎంఐని చెల్లించకపోయినా వారికి ఈ పథకం ప్రయోజనాలు లభించవని బ్యాంక్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+