Axis My India: పుదుచ్చేరిలో ఎవరికి ఎన్ని సీట్లు?
పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన 16 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఎన్‌డీఏ కూటమి (NRC+) సునాయాసంగా అధిగమిస్తుందని యాక్సిస్ మై ఇండియా ( AXIS MY INDIA) అంచనా వేసింది. ఈ కూటమికి 16 నుండి 20 స్థానాలు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఓట్ల శాతంలో కూడా 40 శాతంతో ఎన్‌డీఏ అగ్రస్థానంలో నిలిచింది.

ఇందులో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సి (AINRC) ఒంటరిగానే 10-12 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. బీజేపీ 4-6 సీట్లు, ఏఐఏడీఎంకే 1-2 సీట్లు, ఎల్‌జేకే 1-2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో, అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16-17 కాగా.. ఎన్‌డీఏ కూటమి 16 నుండి 19 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. ప్రత్యర్థి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమి 10-12 స్థానాలకే పరిమితం కానుండగా, ఇతరులు 1-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications