Axis My India exit polls: త్రిపురలో మరోసారి బీజేపీ హవానే
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 36-45 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరగా సోమవారం నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. దీంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో పార్టీల మధ్య హోురాహోరీగా పోరు జరిగినట్లు తెలుస్తోంది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 36-45 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక వామపక్షాల కూటమికి 6-11 సీట్లు దక్కే అవకాశం ఉంది. టీఎంసీకి 9-16 స్థానాల్లో గెలుచుకుంటుందని పేర్కొంది.

మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 31 స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే బీజేపీకి 36-45 సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో మరోసారి త్రిపురలో బీజేపీనే అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
త్రిపురతోపాటు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications