వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య వివాదం ... గతంలోనూ మూడు సార్లు మధ్యవర్తిత్వం .. ఏం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ప్యానెల్ ఛైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ ఖలీపుల్లాను నియమించిన సుప్రీంకోర్టు... ప్యానెల్‌లో సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ 4 వారాల్లోగా ప్రారంభించి 8 వారాల్లో పూర్తి చేయాలని ప్యానెల్‌కు సూచించింది. ఈ నివేదికను గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : అయోధ్య మధ్యవర్తిత్వానికి మీడియా దూరం ... కారణాలివే ..? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : అయోధ్య మధ్యవర్తిత్వానికి మీడియా దూరం ... కారణాలివే ..?

 రెండు దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదం

రెండు దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదం

రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి గత వారం నుంచి చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు... వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏం జరిగింది... ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనే అంశానికి తాము ప్రాధాన్యత ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 గతంలో కోర్టులు కూడా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించి విఫలం

గతంలో కోర్టులు కూడా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించి విఫలం

రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అవి ఏమాత్రం విజయవంతం కాలేదు. గతంలో అలహాబాద్ హైకోర్టు లో లక్నో బెంచ్ మధ్యవర్తిత్వం చేయడానికి విఫలయత్నం చేసింది. ఆగస్టు 3వ తేదీన వాదనలు ముగిసిన తరువాత బెంచ్ సభ్యులు అందరు న్యాయవాదులను పిలిచి కేసును పునరుద్ధరించటానికి కోరుతున్నారా అని అడిగారు. సెప్టెంబరు 2017 హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేయడానికి, మధ్యవర్తిత్వాన్ని నెరపటానికి పలు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సుప్రీం కోర్టు కలుగజేసుకొని హైకోర్టు మధ్యవర్తిత్వం జరపనున్న నేపథ్యంలో ఇరు వర్గాలు సహకరించి ఒక నిర్ణయానికి రావాలని సెప్టెంబర్ 23 వరకు పరిష్కారాన్ని కనుగొనాలని సూచించింది.

జస్టిస్ జేఎస్ ఖేహర్ మధ్యవర్తిత్వం చేసినా ఫలితం శూన్యం

జస్టిస్ జేఎస్ ఖేహర్ మధ్యవర్తిత్వం చేసినా ఫలితం శూన్యం

అయితే ఈ కేసు విషయంలో కోర్టు ప్రమేయం కంటే మధ్యవర్తితం అవసరమని చాలా మంది అభ్యర్ధనల తరువాత చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ దీనిని సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా, సెంటిమెంట్ వ్యవహారంగా పరిగణించి హిందూ ముస్లింల మధ్య మధ్యవర్తిత్వం కోసం సున్నితమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా ప్రయత్నం చేశారు . కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టు బయట ఈ వివాదాన్ని పరిష్కరించమని చెప్పిన నేపథ్యంలో జరిగిన చర్చలు రాజకీయ పార్టీల వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు .

వ్యక్తిగతంగా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించి విఫలమైన నాయకులు

వ్యక్తిగతంగా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించి విఫలమైన నాయకులు

1990 లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బాబ్రీ మసీదును పాక్షికంగా కూల్చిన తరువాత నాటి ప్రధాని చంద్రశేఖర్ ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొనివచ్చి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అది విఫలమైంది. ఆ తర్వాత 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కూడా హిందూ ముస్లింల మధ్య విమానం గా ఉన్న ఈ కేసును పరిష్కరించాలని ప్రయత్నం చేశారు. ఆయన కూడా పరిష్కరించలేకపోయారు. ఇక ఆ తర్వాత 2003లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో చాలా గట్టి ప్రయత్నం జరిగింది. వాజ్ పేయి ఆయన కార్యాలయంలో అయోధ్య సెల్ ను ఏర్పాటు చేసి ఒక సీనియర్ అధికారి ద్వారా హిందూ ముస్లింల మధ్య సఖ్యత కుదర్చడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా సత్ఫలితాలివ్వలేదు. ఆ తర్వాత 2014లో అన్సారీ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు.కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదు.

ఈసారైనా మధ్యవర్తిత్వం ఫలిస్తుందా ?

ఈసారైనా మధ్యవర్తిత్వం ఫలిస్తుందా ?


ఇక తాజాగా నేడు అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ఈ ప్రయత్నం అయినా సఫలం అయితే రామజన్మ భూమి బాబ్రీమసీదు వివాదం పరిష్కరించబడుతుంది. హిందూ, ముస్లిం ల మధ్య వివాదంగా ఉన్న ఈ సమస్య ఈసారైనా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడాలని అందరూ కోరుకుంటున్నారు.

English summary
The Supreme Court on Friday referred Ayodhya's Ram Janmabhoomi-Babri Masjid land dispute case to mediation for amicable settlement. in the past Mediation attempt in allahabad High Court that was failed .CJI J S Khehar too attempted for mediation but not solved the controversy. Mediation attempts by individuals also failed in the ayodhya controversy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X