రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టలో అనుసరించిన సంప్రదాయాలు, పూజా విధానాలు ఇవే

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.

ఈ మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12:31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 89 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.

Ayodhya Ram Mandir: These traditions followed for Pran Prathishta of Ram Lalla idol

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగింది. మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ మాత్రమే గర్భగుడిలోనికి ప్రవేశించారు.

రాములవారికి తొలి పూజలు చేశారు. విగ్రహం కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. కాటుకను పూశారు. అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్, వారణాశి కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్.. సారథ్యంలో 121 మంది అర్చకులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

Ayodhya Ram Mandir: These traditions followed for Pran Prathishta of Ram Lalla idol

శైవ, వైష్ణవ, శాక్త, గణాపత్య, పత్య, సిక్, బౌద్ధ, జైన, దశ్నం, శంకర్, రమానంద్, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణు నామి, రామ్‌సనేహి, ఘీషాపంథ్, గరీబ్‌దాసి, కబీర్‌పంథ్, వాల్మీకీ, శంకర్‌దేవ్, మాధవ్ దేవ్, ఇస్కానం, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ పరంపరలకు అనుగుణంగా ఈ ప్రక్రియ సాగింది.

Ayodhya Ram Mandir: These traditions followed for Pran Prathishta of Ram Lalla idol

గాయత్రి పరివార్, అనుకూల్ చంద్ర, ఠాకూర్ పరంపర, మహిమా సమాజ్, అకాలి, నిరంకారి, నామ్‌దారి, రాధాసోమి, స్వామినారాయణ్, వర్కరి, వీరశైవ వంటి 150కి పైగా సంప్రదాయాలను అనుసరించారు. ఆదివాసీ సంప్రదాయాలైన మహామండలేశ్వర్, మండలేశ్వర్, శ్రీమంత, మహంత, నాగా.. వంటి 50 ఆదివాసీ, గిరివాసీ, తథావసి, ద్వీపవాసి సంప్రదాయాలను అర్చకులు పాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+