• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Ayodhya verdict: అందరి దృష్టీ యోగి ఆదిత్యనాథ్ మీదే: పలు కీలక నిర్ణయాలు..!

|

లక్నో: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువడించడానికి అట్టే సమయం లేదు. ఈ రెండురోజులే గడువు. సోమవారం నుంచి ఏ రోజైనా అయోధ్య భూవివాదంపై తీర్పు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఉత్తర్ ప్రదేశ్ పై నిలిచింది. శ్రీరామచంద్రుడు జన్మించిన, నడయాడిన గడ్డ కావడం వల్ల అయోధ్యపై తీర్పు విషయంలో అక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటోందనే విషయంపై చర్చ నడుస్తోంది.

Ayodhya verdict: అయోధ్యపై తీర్పు: రైల్వే స్టేషన్లలో కనీవినీ ఎరుగని భద్రత..! ఆర్పీఎఫ్ సెలవులు రద్దు

సుప్రీం చీఫ్ జస్టిస్ ఆదేశాలకు అనుగుణంగా..

సుప్రీం చీఫ్ జస్టిస్ ఆదేశాలకు అనుగుణంగా..

అయోధ్యపై తీర్పు వెలువడబోతున్న కీలక సమయం కావడం వల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శని, ఆదివారాల్లో సైతం విధుల్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు సచివాలయంలో కీలక సమావేశాన్ని ఆయన నిర్వహించబోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ మరి కొన్ని గంటల్లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్ తో భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు, ఆయన చేసిన సూచనలు, సలహాలు. ఇతర ఆదేశాలపై తక్షణ చర్యలు తీసుకోవడానికి సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి ఉంటుందని కొన్ని కీలక శాఖలకు ఆదేశించడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.

అధికారిక పర్యటలన్నీ రద్దు..

అధికారిక పర్యటలన్నీ రద్దు..

తీర్పు వెలువడబోయే రోజు యోగి ఆదిత్యనాథ్ సచివాలయంలోనే ఉండటానికి అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తీర్పు వెలువడటాకి ముందు, ఆ తరువాత అధికారిక పర్యటనల్నింటినీ రద్దు చేయొచ్చని అంటున్నారు. సాధారణంగా వారాంతపు రోజుల్లో ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని వెనుకబడిన జిల్లాలను సందర్శిస్తుంటారు. ఈ సారి అలాంటి కార్యక్రమాలను రద్దు చేశారని సమాచారం. తీర్పు వెలువడిన తరువాత ప్రత్యేకించి- అయోధ్యలో ఏం జరుగుతోందనే విషయాలను తెలుసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 2

సచివాలయంలో మాస్టర్ కంట్రోల్ రూమ్..

సచివాలయంలో మాస్టర్ కంట్రోల్ రూమ్..

4 గంటల పాటు అందుబాటులో ఉండేలా మాస్టర్ కంట్రోల్ రూమ్ ను ఉత్తర్ ప్రదేశ్ నెలకొల్పబోతోంది. దీనితో పాటు- అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత ప్రదేశానికి వెళ్లడానికి అధికారిక హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచారు. అయోధ్య సహా సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా భధ్రతను పర్యవేక్షించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయోధ్యలో రెండు దశల్లో డ్రోన్ల ద్వారా భద్రతా చర్యలను పరిశీలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇవే చర్యలను తీర్పు వెలువడిన తరువాత కూడా కొనసాగిస్తామని తెలిపారు.

English summary
The state government is focussing on security arrangements in the temple town Ayodhya to deal with any untoward incident which might arise following verdict in Ram Janmabhoomi-Babri Masjid land dispute case. As part of security measures, helicopters are being deployed that will be on standby if in case any need arise post-Ayodhya verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X