• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం యోగి అర్ద్రరాత్రి సమీక్ష : అయోధ్యలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థ : అందరి చూపు అటువైపే..!

|

సుదీర్ఘ చరిత్ర. దశాబ్దాల వివాదం. అనేక మలుపులు..అభ్యంతరాలు..ఆందోళనలు. అటువంటి కీలక అంశం పైన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంపై యాజమాన్య హక్కులు ఎవరికి లభిస్తాయో మరి కొద్ది గంటల్లో తేలనుంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి.. బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువడనుంది.

ఉదయం పదిన్నర గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుంది.

సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కేసు విచారణ కొనసాగింది. అక్టోబర్‌ 16న వాదనలు వినడం ముగించిన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు దేశం యావత్తు సుప్రీం తీర్పు వైపే చూస్తోంది. అదే సమయంలో అందరి చూపు ఉత్తర ప్రదేశ్ వైపు ఫోకస్ అయి ఉంది.

అయోధ్య తీర్పు: ఇది ఏ ఒకరి విజయమో, పరాజయమో కాదు, ప్రధాని మోడీ

యూపీలో సీఎం యోగి అర్దరాత్రి సమీక్ష..

యూపీలో సీఎం యోగి అర్దరాత్రి సమీక్ష..

సుప్రీం తీర్పు సమయం పైన స్పష్టత వచ్చిన వెంటనే కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర హోం శాఖ యూపి అధికార యంత్రాగానికి కీలక సూచనలు చేసింది. ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం లేకుండా.. సామరస్య వాతావరణం కొనసాగేలా తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించింది. దీంతో..ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అర్ద్రరాత్రి ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు.

అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. లక్నోలో రాష్ట్రా స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటుకు ఇప్పిటికే ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు ఉన్నతాధికారులక సెలవులు రద్దు చేసింది. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తాత్కాలిక జైళ్లను సిద్దం చేసారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఉపేక్షించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉత్కంఠ...శాంతి సమావేశాలు..

ఉత్కంఠ...శాంతి సమావేశాలు..

తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. అయోధ్యలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 60 కంపెనీల పారా మిలటరీ బలగాలు (ఒక్కో కంపెనీలో 90 - 125 మంది), ఇతర సిబ్బందిని అక్కడ మోహరించారు.

పరిస్థితిని డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం సమీక్షిస్తున్నారు. రామజన్మభూమి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి వాహనాన్ని అణువణువూ తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో..

శాంతిని పరిరక్షించాలని కోరుతూ మీరట్‌ డివిజనల్‌ కమిషనర్‌ అనితా మెష్రామ్‌ హిందు, ముస్లిం వర్గాల మత పెద్దలతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవద్దని, రెచ్చగొట్టే సందేశాలు ప్రచారం చేయవద్దని కోరారు. నవంబర్‌ 30వ తేదీ వరకు నిరంతరం పనిచేసేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

అందరి చూపు అటువైపే...

అందరి చూపు అటువైపే...

దేశం మొత్తమే కాదు..భారత దేశంలోని ఒక సుదీర్ఘ వివాదానికి..అత్యున్నత న్యాయ వ్యవస్థగా పేరున్న సుప్రీం కోర్టు అంతిమ తీర్పు ఎలా ఉండబోతోందనే అంశం పైన పొరుగు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే సమయంలో సంయమనంతో వ్యవహరించారంటూ ప్రధాని మోదీ కోరారు. ఇది పరీక్షా సమయం లాంటిదని... న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం ఉంచాలని.. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని ఢిల్లీ జమా మసీద్ షాహా ఇమామ్ య్యద్ అహ్మద్ బుఖారీ పిలుపునిచ్చారు.

దేశ వ్యాప్తంగా ర్యాలీలు..ప్రదర్శనల పైన నిషేధం విధించారు. మరి కొద్ది గంటల్లో రానున్న తీర్పు పైనే దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. దీంతో..అందరి చూపు సర్వోన్నత న్యాయస్థానం వైపే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ayodhya Verdict: U.P Cm Yogi conducted mid night meeting with higher officials to reveiw the situation.Central govt monitoring the situation minute to minute. All leaders appealing for peace. total nation concentrated focus on supreme verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more