వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారణాసిలో మహిళా డాక్టర్‌పై లైంగిక దాడి

|
Google Oneindia TeluguNews

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ సోంత నియోజక వర్గంలో ఒక మహిళ డాక్టర్ మీద కోందరు లైంగిక దాడికి పాల్పడ్డారు. కేసు పెట్టడానికి వెళితే పోలీసులు నిర్లక్ష్యం చేశారు. చివరికి ఐపీఎస్ అధికారి జోక్యం చేసుకున్నా.. పోలీసులు వారి తీరు మార్చుకోలేదని ఆమె విలపిస్తున్నారు.

అమెరికాకు చెందిన ఆ భారతీయ మహిళా డాక్టర్ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళతానని అంటున్నారు. సదరు మహిళా డాక్టర్ వారణాసి చేరుకుని ప్రసిద్ది చెందిన బనారస్ హిందూ విశ్వ విధ్యాలయంలో పీహెచ్‌డి చేస్తున్నారు.

ఆయుర్వేద వైద్యురాలు అయిన ఈమె షుగర్ వ్యాది నివారణపై పరిశోదనలు చేస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీన సదరు మహిళా డాక్టర్ తన స్నేహితులతో కలిసి యూనివర్శిటి క్యాంపస్ లో నడచి వెలుతున్న సమయంలో ఐదుగురు ఆమె మీద లైంగిక దాడికి ప్రయత్నించారు.

ఆమె ల్యాప్ టాప్ ద్వంసం చేసి మొబైల్ ఎత్తుకుని వెళ్లారు. దీంతో బాధిత డాక్టర్ లంకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకుండా, కేసు పెట్టకుండా సైలెంట్‌గా ఉండి పోవాలని ఉచిత సలహా ఇచ్చి అమెను పంపించేశారు.

ayurvedic doctor molested on University campus in Varanasi

ఆత్మ రక్షణ కోసం తీసుకున్న శిక్షణతో తాను ఆరోజు తప్పించుకున్నానని డాక్టర్ అంటున్నారు. చివరికి జిల్లా ఎస్పీ జోక్యంతో కేసు నమోదు అయ్యింది. డాక్టర్ ను వైద్య పరిక్షలకు పంపించారు. అయితే మహిళ డాక్టర్లతో కాకుండా ఇద్దరు మగ డాక్టర్లతో ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు.

తనకు పురుషులు వైద్య పరీక్షలు చేస్తుంటే చాల బాధ అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను ఆయుర్వేద డాక్టర్ అని తెలుసుకున్న ఆ ఇద్దరు వైద్యులు చేతులు చూపించి జాతకం చెప్పాలని వేదించారని, అప్పుడు పక్కనే మహిళా పోలీసు అధికారి ఉన్నా పట్టించుకోలేదని చెప్పారు.

యూనివర్శిటిలో సంఘటన జరిగిన ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి ఆరోజు ఏమి జరిగిందని నటించి చూపించాలని పోలీసులు వేధించారని ఆమె ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ సోంత నియోజక వర్గంలో మహిళల పరిస్థతి ఈ విధంగా ఉంటే మిగిలిన చోట్ల ఎంత దారుణంగా ఉంటుందో అర్థం అవుతుందని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
US-based Indian ayurveda doctor was allegedly molested by five men on April 22 on the campus of the renowned Banaras Hindu University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X