మోడీ దావూద్‌ను కలిశారు: ఆజంఖాన్ సంచలనం

లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ నిరుడు డిసెంబర్‌లో లాహోర్‌లో పర్యటించినప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను కలుసుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ దావూద్ కలుసుకున్నట్లుగా తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. దీంతో తీవ్ర కలకలం రేగింది.

పాకిస్తాన్ నవాజ్ షరీఫ్‌తో భేటీ అయిన సమయంలో మోడీ దావూద్‌ అక్కడే ఉన్నాడని ఆయన చెప్పారు. మోడీ ఖండిస్తే తాను రుజువులు చూపగలనని ఆయన అన్నారు. మోడీ నవాజ్ షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి అనూహ్యంగా, ఆకస్మికంగా మోడీ పాకిస్తాన్ వెళ్లడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Azam Khan

మోడీ దావూద్‌ను కలిసినట్లు రుజువు చేసే ఫోటో కూడా చూపగలనని ఆయన అన్నారు. నవాజ్ షరీఫ్ తల్లిని మోడీ కలిసినప్పుడు అద్వానీ, జిందాల్ కూడా ఉన్నారని ఆయన అన్నారు. ఘాజీపూర్ జిల్లాలోని ఓ కళాశాల వార్షికోత్సవానికి వచ్చిన ఆజంఖాన్ మీడియాతో మాట్లాడారు.

ఆజం ఖాన్ వివాదాస్పద ప్రకటనలకు పెట్టింది పేరు. దాద్రీ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు దావూద్ మోడీ కలిశారంటూ ఆజం ఖాన్ చేసిన ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+