విప్రో వైస్ ఛైర్మన్‌గా ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషద్..!

బెంగుళూరు: అజీమ్ ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ త్వరలో విప్రో వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో విప్రో కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టెర్, సీఎఫ్ఓ సురేష్ సేనాపతి పదవీ విరమణ చేస్తుండటంతో రిషద్ ప్రేమ్ జీని వైస్ ఛైర్మన్‌ పదవికి ఎంపిక చేయనున్నారు.

Azim Premji's son Rishad may become Wipro vice-chairman

$7.3 బిలియన్ విలువ ఉన్న దేశీయ మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో. రిషద్ ప్రేమ్‌జీ ప్రస్తుతం విప్రోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. విప్రో కంపెనీలో ప్రేమ్‌జీ కుటుంబానికి 75 శాతం వాటా ఉంది. 37 ఏళ్ల వయసున్న రిషద్ ప్రేమ్‌జీ హార్వర్డ్ బిజనెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

2007లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలకు సంబంధించిన స్పెషల్ ప్రాజెక్టులకు బిజినెస్ హెడ్‌గా విప్రోలో బాధ్యతలు స్వీకరించారు. సిటీ బ్యాంక్‌లో సిటీ టెక్నాలజీ సర్వీసెస్‌ను విప్రో సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత విప్రో కార్పోరేట్ ఇన్వెస్టర్ రిలేషన్స్ విభాగానికి హెడ్‌గా కొంత కాలం పనిచేసి ఇప్పుడు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+