ఫ్లెష్ ట్రేడ్: బంగ్లా యువతిపై గ్యాంగ్‌రేప్, రైల్లో పడేశారు, 7గురిపై కేసు

థానే: మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన 20ఏళ్ల ఓ యువతిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టారు. అంతేగాక, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆమెను తీవ్రంగా కొట్టారు.

అనంతరం ఆమెను ఓ రైలు బోగీలో పడేశారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

బంగ్లాదేశ్‌లోని అభయ్‌నగర్‌కు బాధిత యువతిని ముంబైకి తీసుకొచ్చిన మిథున్ చక్రవర్తి అనే వ్యక్తి ఓ జిజుకు అమ్మేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె గత నాలుగేళ్ల నుంచి జిజు వద్దనే కళ్యాణ్ రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఓ మురికివాడలో ఉంటున్నట్లు చెప్పారు. భోపాల్ రైల్వే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని కళ్యాణ్ పోలీసులు తెలిపారు.

 B'deshi woman pushed into flesh trade, gangraped; 7 booked

జిజు, మరికొందరు ఆమెను వ్యభిచారం కూపంలోకి నెట్టారని చెప్పారు. మే 10న అర్ధరాత్రి ఆమెను కళ్యాణ్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఆమెను తీవ్రంగా కొట్టారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఆమెను పఠాన్‌కోట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పడేసి పరారయ్యారు.

భోపాల్ రైల్వే స్టేషన్ చేరుకున్న ఆ రైలులో అపస్మారక స్థితిలో ఉన్న బాధిత యువతిని గుర్తించిన భోపాల్ పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మే 13న ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు, ముంబై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కళ్యాణ్ రైల్వే పోలీసులకు ఆ కేసు బదిలీ చేయడం జరిగింది. ఏడుగురిపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు కళ్యాణ్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+