ఐ లవ్ కత్రినా: సూసైడ్ నోట్ రాసి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

భోపాల్: మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ కుమార్‌ అనే ఇరవై రెండేళ్ల అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను వింద్యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

సంత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంటులో తన మిత్రులు ముగ్గురితో కలిసి ఉంటున్నాడు. అతను శనివారం రాత్రి గది లోపలి నుంచి తాళం వేసుకున్నాడని, ఎంత కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చానని రాహుల్‌ స్నేహితుడు నవరతన్‌ తెలిపాడు.

B.tech student commits suicide

తలుపులు పగులగొట్టి చూడగా రాహుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహం పక్కన రాహుల్‌ రాసినట్టుగా భావిస్తున్న ఓ లేఖ ఉందని చెబుతున్నారు.

దానిలో.. ఐ లవ్‌ కత్రీనా.. ఏదో ఒకరోజు నేను సాధిస్తాను అంటూ రాసి ఉన్నట్లు వారు వివరించారు. రాహుల్‌ మృతికి గల వాస్తవ కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. కాగా, సదరు విద్యార్థి బీహార్ రాష్ట్రానికి చెందిన వాడిగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+