మోస్ట్ వాంటెడ్ దొంగను పట్టించిన 'బాహుబలి': ఇలా చిక్కాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: బాహుబలి చిత్రం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టించింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. సదరు దొంగ ఈ సినిమాను చూసేందుకు థియేటర్‌కు వచ్చి పోలీసులకు దొరికిపోయాడు.

అతనిని కమిషనరేట్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. అతడు ఏటీఎంలలో డబ్బులు దొంగిలించే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇన్నాళ్లు పోలీసులకు దొరక్కుండా ముప్పు తిప్పలు పెట్టాడు.

bahubali 2

ఆ దొంగ పేరు సంభవ్‌. అతను బాహుబలి 2: ది కన్‌క్లూజన్‌ సినిమాను చూసేందుకు థియేటర్‌కు వచ్చాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడ్ని అరెస్టు చేసినట్లు భువనేశ్వర్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు.

నిందితుడిపై దాదాపు 50 ఏటీఎంలలో నగదు దొంగతనాలు చేసినట్లు కేసులున్నాయి. భువనేశ్వర్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఆచార్యపై కేసులు ఉన్నాయి.

అతడు సినిమా చూసేందుకు సినిమా కాంప్లెక్స్‌ వచ్చిన సమయంలో గుర్తించిన స్పెషల్‌ స్క్వాడ్‌ వెంటనే అరెస్టు చేసిందని కమిషనర్‌ సత్యబ్రత భోయ్‌ తెలిపారు. అతని పైన 2007లో తొలి కేసు నమోదయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Commissionerate Police on Monday arrested most wanted ATM looter Sambhav Acharya from a theatre here, while he was watching the much-awaited film "Baahubali 2: The Conclusion".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి