గంగోత్రిలో చిక్కుకున్నరాందేవ్, స్టూడెంట్స్, హెచ్చరించినా

అయితే, తాము వారిస్తున్నా వినకుండా యాత్రను కొనసాగించడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ యాత్రలో అవాంఛిత సంఘటనలేమైనా జరిగితే రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. గంగోత్రి వద్ద రాందేవ్ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలకు రహదారులు కొట్టుకుపోగా, నదీమట్టాలు పెరుగుతున్నాయి.
కేదార్‌నాథ్, గంగోత్రి యాత్రికులు వేలాదిమంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రను మూడు రోజులపాటు రద్దు చేస్తున్నట్టు, వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19న పునరుద్ధరిస్తామని రుద్రప్రయాగ కలెక్టర్ రాఘవ్ లాంగర్ తెలిపారు.
మరోవైపు, కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన 200 మంది భక్తులను క్షేమంగా కిందికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 35 మందిని ఇప్పటికే సోన్‌ప్రయాగ్‌కు చేర్చామని, మిగిలిన వారినీ కిందకు చేరుస్తామన్నారు. మరోవైపు బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రిని దర్శించుకునే యాత్రీకుల సంఖ్యను అధికారులు క్రమంగా తగ్గిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోజుకు 10 నుంచి 12 మంది యాత్రికులనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications