రూ.15కే బాబా రాందేవ్ పతంజలి ఆటా నూడుల్స్
హైదరాబాద్: ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ ఆటా నూడుల్స్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ తమ నూడుల్స్‌లో సీసం, మోనో సోడియం, గ్లూటామెట్ వంటి ప్రమాదకర పదార్థాలు లేవని ప్రకటించారు.
ఒక్కో ప్యాకెట్ ధర రూ. 15గా నిర్ధారించారు. ఈ నూడుల్స్‌ను దేశ వ్యాప్తంగా మూడు లక్షల దుకాణాల్లో విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆటా న్యూడుల్స్‌తో పాటు పతంజలి గ్రూప్ హెల్త్ డ్రింక్స్ తయారు చేయాలని యోచిస్తోంది.
With nationwide launch of Most awaited #PatanjaliAttaNoodles on 16 Nov, New trend of healthier instant food will begin @yogrishiramdev
— tijarawala sk (@tijarawala) November 14, 2015 కాంప్లాన్, బోర్న్‌వీటా వంటి డ్రింక్‌లకు ప్రత్యామ్నాయంగా పవర్ వీటా పేరుతో డ్రింక్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. కాగా బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్ల రసాలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
. @yogrishiramdev launches #PatanjaliAttaNoodles in #Delhi pic.twitter.com/y9Y4UVRND6
— India TV (@indiatvnews) November 16, 2015 2014 సంవత్సరానికి గాను పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సంస్ధ రూ. 1200 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. 2015 సంవత్సరానికి గాను రూ. 2000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
WATCH: #Maggi की टक्कर में आज से रामदेव के आटा नूडल्स https://t.co/zjnKMQfaO3 @yogrishiramdev pic.twitter.com/yvVD0WmjY5
— ABP न्यूज़ हिंदी (@abpnewshindi) November 16, 2015 Baba @yogrishiramdev to launch Patanjali noodles in Delhi today
VIDEO: https://t.co/r5mSN0Hcwa pic.twitter.com/EyJRUxcweI
— ABP News (@abpnewstv) November 16, 2015 ఇప్పటికే ఈ ఆటా నూడుల్స్‌ను తిన్న వారు సోషల్ మీడియాలో 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అంటూ తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఇక మార్కెట్‌లోని పలు రకాలైన నూడుల్స్‌లో మోతాదుకు మించిన సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో దేశ వ్యాప్తంగా వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications