వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ మసీదు శిథిలాల కోసం పోరాటం: సుప్రీంలో పిటీషన్ దాఖలుకు నిర్ణయం.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో తాజాగా క్యురేటివ్ పిటీషన్ దాఖలు కానుంది. క్యురేటివ్ పిటీషన్ ను దాఖలు చేయాలని బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ప్రతినిధులు గురువారం నిర్ణయించారు. సుప్రీంకోర్టు. అయోధ్యపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును నిరసిస్తూ ఇదివరకు దాఖలైన రివ్యూ పిటీషన్లన్నింటినీ కొట్టివేసిన తరువాత.. బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ప్రతినిధులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకోవడం సరికొత్త చర్చకు అవకాశం కల్పించినట్టయింది.

నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీనీ వదల్లేదు: టిక్ టాక్ వీడియోలో సెటైర్లు: జైలుపాలు..!నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీనీ వదల్లేదు: టిక్ టాక్ వీడియోలో సెటైర్లు: జైలుపాలు..!

కూల్చివేతకు గురైన అనంతరం బాబ్రీ మసీదుకు సంబంధించిన ప్రతి ఇటుకను తమకు కేటాయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ ను దాఖలు చేయాలని కార్యాచరణ కమిటీ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం వారు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. బాబ్రీ మసీదు శిథిలాలను తమకు కేటాయించేలా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి, రామమందిరం కమిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ క్యురేటివ్ పిటీషన్ ను వేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

Babri Masjid Action Committee To File Curative Petition in Supreme Court for Debris From Mosque

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం రామ్ లల్లా విరాజ్ మాన్ కు చెందుతుందంటూ సుప్రీంకోర్టు కిందటి నెల 9వ తేదీన తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. దీనిపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా పలు సంఘాలు రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అదే సమయంలో బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ప్రతినిధులు రంగంలో దిగారు. క్యురేటివ్ పిటీషన్ కావడం వల్ల దీన్ని తప్పనిసరిగా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.

English summary
After Supreme Court dismissed a batch of review petitions filed against its judgment in the Ayodhya Ram Temple case, the Babri Masjid Action Committee (BMAC) mulls over filing a curative petition against the top court's verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X