వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ కేసులో సుప్రీం షాక్‌.. అద్వానీ, ఉమాభారతి, మురళీమనోహర్ జోషిలకు గండం?

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లాల్ కృష్ణ అద్వానీపై ఉన్న కుట్ర కేసును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లాల్ కృష్ణ అద్వానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కూల్చివేతలో అద్వానీపై ఉన్న కుట్ర కేసును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 22న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు దీనిపై స్పష్టత తీసుకురానున్నది. అద్వానీతోపాటు ఇతర నేతలు ఈ కేసులను ఎదుర్కొంటారా లేదా అన్నది అప్పుడే తేలుతుంది. అద్వానీతోపాటు ఇతర నేతలపై ఉన్ కేసులను కింది కోర్టు ఎత్తివేయడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సాంకేతిక కారణాలు చూపుతూ అద్వానీపై కేసు ఎత్తివేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. విచారణ సుదీర్ఘకాలం కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. నిందితుల సంయుక్త విచారణకు అంగీకరించింది.

Babri Masjid demolition: Supreme Court wants trial against Advani, Joshi, Uma, other accused expedited

1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే. లక్నో ట్రయల్ కోర్టు దీనిపై విచారణ జరుపుతున్నది. అద్వానీతోపాటు మరికొందరు నేతలపై ఉన్న కుట్ర కేసులను గతంలో ఈ ట్రయల్ కోర్టు ఎత్తివేసింది.

సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇదే చివరి విచారణ కానుందని, ఆ రోజు బీజేపీలో కొంతమంది సీనియర్ నేతలు కచ్చితంగా కుట్రపూరిత ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా లక్నో, రాయబరేలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఈ కేసులో అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషిలకు గండం తప్పకపోవచ్చని అంటున్నారు.

English summary
The Supreme Court today expressed concern over delay in trial against people involved in demolition of Babri Masjid. The apex court has said that joint trial of the accused could be held in the matter to speed up the judicial process. The Supreme Court's observation today may brew trouble for BJP veterans LK Advani, Murli Manohar Joshi and Uma Bharti. They are likely to face conspiracy charges along with others. The apex court is likely to club two separates cases going on in Lucknow and Raebareli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X