బాగేశ్వర్ బాబా వర్సెస్ బెంగాలీ సంస్కృతి: దుర్గాపూజ మాంసాహార వివాదంలో సువేందు విలవిల!

పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వలోని తృణమూల్ కాంగ్రెస్ ను మట్టికరిపించి సీఎంగా పగ్గాలు చేపట్టిన సువేందు అధికారి (Suvendu Adhikari).. రాష్ట్రంలో ఉత్తరాది హిందూత్వ వాదాన్ని అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా దుర్గాపూజ సందర్భంగా మాంసాహారానికి దూరంగా ఉండాలంటూ మధ్యప్రదేశ్ బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అలియాస్ బాగేశ్వర్ బాబా (Bageshwar Baba) ఇచ్చిన పిలుపు ఇప్పుడు సువేందు మెడకు చుట్టుకుంటోంది. ఫైనల్ గా బీజేపీ పెద్దల్ని మెప్పించే ప్రయత్నంలో తనకు ఓటేసిన బెంగాలీలకు సువేందు దూరమవుతున్నారు.

బెంగాల్లో భారీ విజయంతో సత్తా చాటిన మమత..! 15-3 తేడాతో సువేందు చిత్తు..!
బెంగాల్లో భారీ విజయంతో సత్తా చాటిన మమత..! 15-3 తేడాతో సువేందు చిత్తు..!

దుర్గాపూజ పండల్స్ (Durga Puja) సమీపంలో మాంసాహారాన్ని పూర్తిగా దూరం పెట్టాలని, అలా చేయకపోతే పండుగ పవిత్రత దెబ్బతింటుందని బాగేశ్వర్ బాబా ఇచ్చిన పిలుపు బెంగాలీ సమాజంలో పెద్ద కలకలాన్నే సృష్టించింది. బెంగాలీ హిందూ సంప్రదాయం ప్రకారం, దుర్గాపూజ సమయంలో చేపలు, మటన్ కోషా వంటి వంటకాలు ఆచార వ్యవహారాల్లోనూ, పండుగ విందులోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. శక్తేయ సంప్రదాయాన్ని అనుసరించే బెంగాలీలకు అమ్మవారి ఆరాధనతో పాటు ఆహార అలవాట్లు కూడా ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఉత్తరాది ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న శాకాహార నియమాలను బెంగాల్‌ వంటి విభిన్న సాంస్కృతిక రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం స్థానిక అస్తిత్వానికి పెద్ద సంకటంగా మారింది.

Bageshwar Baba vs Bengal Tradition Suvendu Adhikari Faces Political Crisis Over Durga Puja Food Rules
Mamata Banerjee: అసెంబ్లీకి మమత ? ఉప ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్..!
Mamata Banerjee: అసెంబ్లీకి మమత ? ఉప ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్..!

మరోవైపు, ఈ జాతీయ స్థాయి హిందూ సెంటిమెంట్లను అడ్డుకుంటే తమ సిద్ధాంతాలకు విరుద్ధం అవుతుందనే ఆందోళన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బెంగాల్ సంప్రదాయాలను విస్మరించకుండా, దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న హిందూ నియమాలను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక నాయకత్వం సతమతమవుతోంది. ఈ సున్నితమైన వైవిధ్యాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని తీవ్ర రాజకీయ ఇరకాటంలో పడేశాయి. ఒకవైపు జాతీయవాద భావజాలంతో ముందుకు సాగుతూ, బాగేశ్వర్ బాబాను రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా సువేందు స్వయంగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు అదే ఆధ్యాత్మిక వేత్త ఆహార నియమాలపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. బెంగాలీ హిందువుల ఆహార సంస్కృతిని కాదని ముందుకు వెళ్తే స్థానికంగా తీవ్ర రాజకీయ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+