బాహుబలి 58 అడుగులు: మహామస్తకాభిషేకం (వీడియో)
బెంగళూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన భగవాన్ బాహుబలి స్వామికి 12 సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే మహామస్తకాభిషేకం పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం నుండి ప్రత్యేక పూజా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రావణబెళగోళ పీఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామీజి తెలిపారు.
2018 ఫిబ్రవరి మొదటి వారంలో శ్రావణబెళగోళలోని బాహుబలికి మహామస్తకాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. క్రీ.శ.918లో 58.8అడుగుల ఎత్తు ఉన్న బాహుబలి విగ్రహాన్ని (ఏక శిలావిగ్రహం) గంగా సామ్రాజ్యానికి చెందిన సేనాధిపతి చావుండరాయ స్థాపించారని గుర్తు చేశారు.
అప్పటి నుండి 12 సంవత్సరాలకు ఒక సారి బాహుబలికి మహామస్తాకాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచదేశాలతో పాటు భారదేశంలోని ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. వివిధ రాష్ట్రాలలోని స్వామీజిలు, పీఠాధిపతులు, దిగంబర మునులు పాదయాత్రతో వస్తారని చెప్పారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం సవ్వంగా జరగడానికి, వీఐపీలు, భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని స్వామీజి మనవి చేశారు.












Click it and Unblock the Notifications