‘బాహుబలి’ థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ‘తమిళ పులి' సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. దాడిలో ఎవరికీ ఏ ప్రమాదం జరగనట్లు సమాచారం. ఈ సంభాషణలను వెంటనే తొలగించాలని డిమాండ్ వారు చేశారు.

బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ అంతకుముందు డిమాండ్ చేసిని విషయం తెలిసిందే.
యూట్యూబ్‌లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్‌ను పోలీసులకు అందచేసి ఫిర్యాదు చేసింది. కాగా, జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'బాహుబలి' చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాసింది.












Click it and Unblock the Notifications