బెయిల్ స్కాం: గాలి సహా నిందితులకు సుప్రీంలో ఊరట
దేశంలో సంచలనం సృష్టించిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితులకు ఊరట లభించింది.
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితులకు ఊరట లభించింది. బెయిల్ స్కాం కేసులో గాలి సహా నిందితులందరికీ బెయిల్ రద్దు చేయలేమని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది.

విచారణ 70శాతం పూర్తయినందున బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. గాలి సహా నిందితులందరికి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏసీబీ ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం పైవిధంగా స్పందించింది.
అంతేగాక, కేసును త్వరగా విచారించేందుకు న్యాయూర్తిని నియమించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications