వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ ఫుడ్ ఫెస్టివల్.. రెస్టారెంట్ బ్యానర్.. రంగంలోకి బజరంగ్ దళ్.. వెనక్కి తగ్గిన

|
Google Oneindia TeluguNews

గుజరాత్ సూరత్‌లో ఓ రెస్టారెంట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. అయితే అందులో పాకిస్తాన్ ఫుడ్ కూడా ఉంటుందని తెలియజేసింది. ఆ పోస్టర్ చూసిన బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే ఆ పోస్టర్ తీసివేసింది. దానిని అక్కడ ఉంచి కాల్చి వేశారు. తర్వాత జై శ్రీరామ్, హర హర మహాదేవ్ అనే నినాదాలు చేశారు.

సూరత్‌లో గల టేస్ట్ ఆఫ్ ఇండియా అనే రెస్టారెంట్ 10 రోజుల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ఫుడ్ ఫెస్టివల్ 22వ తేదీన ముగియనుంది. అయితే అందులో పాకిస్తాన్ ఫుడ్ అని బ్యానర్ ఏర్పాటు చేశారు. సూరత్ రింగ్ రోడ్ సబ్ జైలు వద్ద ఆ పోస్టర్ ఏర్పాటు చేశారు. దానిని కొందరు ఫోటో తీసి షేర్ చేశారు. ఇంకేముంది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంకేముంది పోస్టర్ వద్ద భజరంగ్ దళ్ కార్యకర్తలు చేరుకున్నారు.

Bajrang Dal removes ‘Pakistani food festival’ banner from Surat restaurant

ఆ తర్వాత రెస్టారెంట్ యజమాని సందీప్ దావార్ క్షమాపణ చెప్పారని బజరంగ్ దళ్ నేత దేవిప్రసాద్ దుబే తెలిపారు. అంతకుముందు సీ ఫుడ్ ఫెస్టివల్ పేరు కాస్తా.. పాకిస్తాన్ ఫుడ్ ఫెస్టివల్ అని మార్చడంతో అగ్గి రాజేసింది. విషయం తెలిసిన వెంటనే దక్షిణ గుజరాత్ కన్వీనర్ దినేశ్ నవదియా అనుమతితో ఘటనా స్థలానికి వెళ్లామని చెప్పారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ ఎందుకు నిర్వహిస్తున్నారని అడిగామని.. దీంతో క్షమాపణ చెప్పారని వివరించారు.

పాకిస్తానీ అనే పదం బదులు మొఘలాయి కజిన్ అనే పేరు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆ పదం కొందరి సెంటిమెంట్‌ అని.. అందుకోసమే తీసివేస్తామని పేర్కొన్నారు. ఇక ఎప్పుడూ ఆ పదం ఉపయోగించమని స్పష్టంచేశారు. అలా చేయడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. వాటిని తాము గ్రహించామని తెలిపారు. మొఘలాయి కజిన్ అనే పేరు మాత్రం కంటిన్యూ అవుతుందని స్పష్టంచేశారు. అసలే ఇండియా- పాక్ మధ్య భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ఫుడ్ అని ఉండటం వివాదానికి కారణమైంది.

English summary
Bajrang Dal activists pulled down a banner announcing “Pakistani food festival” from a restaurant in Gujarat’s Surat on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X