ఛోటా రాజన్‌కు దావూద్ గురించి తెలుసా? (ఫోటోలు)

న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు అయ్యిన మాఫియా డాన్ ఛోటా రాజన్ ను భారత్ కు తీసుకురావడం పెద్ద సాహసమే అంటున్నారు రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధికారి వి. బాలచంద్రన్.

రా మాజీ అధికారి వి. బాలచంద్రన్ వన్ ఇండియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీంను అరెస్టు చెయ్యాలని భారత్ అధికారులు ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు.

దావూద్ ఇబ్రహీంను అరెస్టు చెయ్యడానికి ఇంటిలిజెన్స్ వార్గాలు ఎప్పటికప్పుడు ఛోటా రాజన్ నుంచి సమాచారం సేకరిస్తున్నాయని మీడియాలో పదేపదే వార్తలు వచ్చాయని అన్నారు. అయితే ఛోటా రాజన్ తో టచ్ లో ఉంటూ సమాచారం సేకరించిన ఇంటిలిజెన్స్ వార్గాలు ఇప్పుడు అతన్ని భారత్ తీసుకు వచ్చి కొత్తగా ఏ విషయాలు తెలుసుకుంటారో అర్థం కావడం లేదని అన్నారు.

దావూద్ గురించి కొత్తగా ఏమి తెలుసు

దావూద్ గురించి కొత్తగా ఏమి తెలుసు

తమ టార్గెట్ దావూద్ ఇబ్రహీం అని చెబుతున్న ఐబి అధికారులు ఛోటా రాజన్ అరెస్టు నిజంగా ఆశ్చర్యం అని బాలచంద్రన్ అంటున్నారు. అయితే దావూద్ గ్యాంగ్ నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఛోటా రాజన్ దగ్గర కొత్త సమాచారం ఏమి ఉంటుంది బాలచంద్రన్ అన్నారు.

ఆకస్మికంగా అరెస్టు అయ్యాడు

ఆకస్మికంగా అరెస్టు అయ్యాడు

ఛోటా రాజన్ బాలిలో ఆకస్మికంగా అరెస్టు అయ్యాడని బాలచంద్రన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలలో భారీ చర్చకు దారి తీసిందని ఆయన గుర్తు చేశారు.

భారత్ రిస్క్ తీసుకుంటున్నది

భారత్ రిస్క్ తీసుకుంటున్నది

ఛోటా రాజన్ విషయంలో భారత్ చాల రిస్క్ తీసుకుంటున్నదని, భారత్ జైళ్ల శాఖలో అవినీతి పెరిగిపోయిందని, ఛోటా రాజన్ కు ప్రాణహాని ఉందని, రాజన్ ను ఇక్కడ ఏ విధంగా కాపాడుతారని బాలచంద్రన్ అన్నారు.

అన్నీ సమస్యలే

అన్నీ సమస్యలే

ఛోటా రాజన్ ను వైద్య పరిక్షలకు, కోర్టుకు తరలించాలంటే కట్టుదిట్టమైన భద్రత అవసరం ఉందని గుర్తు చేశారు. ఇది సామాన్యమైన విషయం కాదని అధికారులకు తెలుసని బాలచంద్రన్ చెప్పారు.

ఎన్ కౌంటర్ మిస్ అయ్యిందని చెప్పారు కదా

ఎన్ కౌంటర్ మిస్ అయ్యిందని చెప్పారు కదా

ఛోటా రాజన్ తో ఐబి అధికారులు నిత్యం టచ్ లో ఉన్నారని హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కే. సింగ్ చెప్పారు కదా బాలచంద్రన్ అన్నారు. కొందరు ముంబై పోలీసులు దావూద్ ఇబ్రహీంకు ఈ సమాచారం ఇవ్వడంతో అతను తప్పించుకున్నాడనే విషయం ఆర్.కే. సింగ్ చెప్పారు కదా అనే విషయాన్ని బాలచంద్రన్ గుర్తు చేశారు.

అరెస్టు చెయ్యాలంటే అనేక చాన్స్ లు ఉన్నాయి

అరెస్టు చెయ్యాలంటే అనేక చాన్స్ లు ఉన్నాయి

ఛోటా రాజన్ ను అరెస్టు చేసి భారత్ కు తీసురావాలంటే అనేక మార్గాలు ఉన్నాయని, ఐబి అధికారులు తలుచుకుంటే ఛోటా రాజన్ ను ఎక్కడైనా కలుసుకునే అవకాశం ఉందని, అయితే ఈ విధంగా అరెస్టు చెయ్యవలసిన అవసరం భారత్ కు లేదని బాలచంద్రన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సురక్షితం కాదని తెలుసు

సురక్షితం కాదని తెలుసు

ఛోటా రాజన్ భారత్ లో ఉడటం సురక్షితం కాదని ఐబి అధికారులకూ తెలుసుని, అయితే ఛోటా రాజన్ ను భారత్ తీసుకు వచ్చిన తరువాత అధికారులు అతనికి ఎలాంటి భద్రత కల్పిస్తారో వేచి చూడాలని బాలచంద్రన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+