• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలాకోట్ వ్యుహకర్త రా చీఫ్‌గా నియామకం, సమర్థుడికే ఐబీ చీఫ్‌ పోస్ట్

|

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన 2.0 టీంలో సవ్యసాచిలకు స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. అలాగే వివిధ కీలక బాధ్యతలను కూడా సమర్థులకు కట్టబెడుతున్నారు. తాజాగా ప్రభుత్వానికి చెవి, ముక్కు అయిన నిఘా విభాగ కీలక పోస్టులను అత్యంత సమర్థులను నియమించారు.

కొత్త అధిపతులు ..

భారత నిఘా విభాగం రా (రీసెర్డ్ అండ్ అనాలిసిస్ వింగ్) సామంత్ కుమార్‌ను నియమించారు. దీంతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరోకు అరవింద్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రధాని మోడీ సిఫారసుకు అపాయింట్‌మెంట్ క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వీరిద్దరూ కూడా 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులుగా తమ కెరీర్ ప్రారంభించారు. గోయల్ పంజాబ్ క్యేడర్ కాగా, కుమార్ అసోం మేఘాలయ క్యాడర్ అధికారులుగా నియమితులయ్యారు. ఈ నెలాఖారులోగా అధిపతులుగా వారు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Balakot air strikes planner is new R&AW chief, Kashmir expert appointed IB chief

ముఖ్యభూమిక ..

బాలాకోట్ వైమానిక దాడులు చేయడంలో కీ రోల్ పోషించింది గోయలే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సారథ్యంలో వైమానిక దళంతో నిత్యం సంప్రదింపులు జరిపి .. ఆపరేషన్ సక్సెస్ చేశారు. బాలాకోట్ దాడుల వ్యుహకర్తగా గోయల్‌కు పేరుంది. వైమానిక దళాన్ని అలర్ట్ చేస్తూ .. దాడులు చేశారని ఆ విభాగ అధికారుల చెప్తుంటారు. ఇటు అరవింద్ కూడా సమర్థమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కశ్మీర్‌ కొండల్లో ఉగ్రవాదం పెట్రేగిపోవడానికి కారణాలు ? ఎలా అణచివేయాలో తెలుసు.

ఆయన అంచనాల మేరకే ఇటీవల తనిఖీలు జరుగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. అసోంలోని సోనిట్‌పూర్ ఎస్పీగా పనిచేసినప్పటి నుంచి మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికలపై అవగాహన ఉంది. తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ .. ఇప్పుడు ఐబీ చీఫ్ స్థాయికి ఎదిగిపోయారు. ప్రస్తుతం రా అధిపతిగా రాజీవ్ జైన్, ఐబీ చీఫ్‌గా అనిల్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2016 డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరి పదవీకాలం ముగిసి ఆరునెలలు అవుతుంది .. కానీ ఎన్నికల నేపథ్యంలో కొనసాగించారు. ఈ క్రమంలో కీలకమైన ఐబీ, రా చీఫ్ పోస్టుకు అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదం తెలుపడంతో వీరి నియామకం ఖరారైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi has appointed Samant Kumar Goel as the next chief of India’s external spy agency, Research and Analysis Wing (R&AW) and Arvinda Kumar as the Director, Intelligence Bureau. PM Modi, as chairman of the Appointments Committee of the Cabinet, also cleared the empanelment of 1986 batch IPS officer in the rank of Director General. Both are Indian Police Service officers of 1984 batch with Goel belonging to Punjab cadre and Kumar, to Assam-Meghalaya cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more