సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడమూ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తప్పే: టైమ్ వేస్ట్ అట..!!

ప్రధాని మోదీపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసిన బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే వారం వాదోపవాదాలను ఆలకించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ చోటు చేసుకున్న అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఇది.

ఇండియా- ది మోదీ క్వశ్చన్ అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీని దేశంలో ఎక్కడ కూడా దీన్ని ప్రదర్శించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీ ఉండటం వల్ల దీన్ని నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. దీని తరువాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల దీన్ని ప్రదర్శించారు.

ఈ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇవ్వాళ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. నిషేధం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమంటూ పిటీషనర్లు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ అడ్వొకేట్ ఎంఎల్‌ శర్మ ఈ పిటీషన్ వేశారు. ఆయనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా మరో పిటీషన్ వేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (2) కింద 2002 గుజరాత్‌ అలర్లకు సంబంధించిన వాస్తవాలు, నివేదికలను తెలుసుకోవాల్సిన హక్కు పౌరులకు ఉందని పిటీషనర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పీఎన్‌ నరసింహ, జస్టిస్ జేబీ పార్థవాలాతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్లను విచారణకు స్వీకరించింది. ఫిబ్రవరి 6వ తేదీన లిస్టింగ్ చేసింది.

Ban on BBC documentary: Minister Kiren Rijiju described as a waste of the Supreme Courts time

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధించడాన్ని పిటీషనర్లు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటీషన్లను దాఖలు చేయడం- విలువైన సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేయడమేనంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సుప్రీంకోర్టు సమయం వృధా అవుతోందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. వేలాది మంది సామాన్య పౌరులు సత్వర న్యాయం కోసం వేచి ఉండగా.. సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని పిటీషనర్లు ఇలా వృధా చేస్తారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+