అక్కడ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగింపు...ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగిస్తున్నట్లు తాజాగా పేర్కొంది. అంటే ఇప్పటి నుంచి జనవరి 22వ తేదీ వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం కొనసాగుతుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇండోర్ మీటింగులకు 300 మందితో అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. లేదా హాట్ సామర్థ్యంలో 50శాతంతో సమావేశాలు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల సంఘం.

అన్ని పార్టీలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి 8వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ రోడ్ షో, ర్యాలీలపై జనవరి 15వ తేదీ వరకు నిషేధం ఉంటుందని పేర్కొంది.అయితే కోవిడ్ కేసుల పై సమీక్షించిన తర్వాతే మళ్లీ నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్న ఈసీ... జనవరి 15వ తేదీన పరిస్థితిని సమీక్షించి మరో వారం రోజుల పాటు రోడ్‌షోలు ర్యాలీలపై నిషేధం విధిస్తూ తాజా నిర్ణయం ప్రకటించింది. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో వరుస సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల అధికారులతో సైతం సమావేశం నిర్వహించి అక్కడి కోవిడ్ పరిస్థితిని సమీక్షించింది.అంతేకాదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్యశాఖ అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది.
అభ్యర్థులు సాధ్యమైనంత వరకు వర్చువల్ క్యాంపెయిన్‌లు నిర్వహించాలని ఈసీ కోరింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రోడ్ షోలు కానీ విక్టరీ ర్యాలీలు కానీ నిర్వహించరాదని జనవరి 8న విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ సమయంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications