ఎటిఎం దాడి: అస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జీ
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఎటిఎం కేంద్రంలో దాడికి గురై ఆస్పత్రి పాలైన కార్పోరేషన్ బ్ాయంక్ అధికారి జ్యోతి ఉదయ్ శనివారంనాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. అయితే, పోలీసులు ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. అతన్ని ఆచూకీ చెప్పినవారికి 5 లక్షల రూపాయల అవార్డు కూడా ప్రకటించారు.
ఎటిఎం కేంద్రంలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన 38 ఏళ్ల జ్యోతి ఉదయ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమె మెదడుకు తీవ్రంగా గాయమైంది. దీంతో కుడివైపు శరీరం పడిపోయింది. ఎటిఎం వద్ద గార్డులు లేరు. పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోనే ఉన్నప్పటికీ దుండగుడు ఎటిఎం సెంటర్‌లోకి చొరబడి దర్జాగా జ్యోతి ఉదయ్‌ని దారుణంగా కొట్టి చోరీకి పాల్పడ్డారు.

దుండగుడు ఆమె తలపై గట్టిగా కొట్టి, ఆమె స్పృహ తప్పి పడిపోగానే 2,500 రూపాయలు, ఆమె మొబైల్ ఎత్తుకెళ్లాడు. కర్ణాటక పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
కర్ణాటకలోని తుముకూరులో పోలీసులు నిందితుడిని పోలిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో తల దాచుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications