బెంగళూరులో కాల్ గర్ల్స్ రాకెట్: హైటెక్ వ్యభిచారం
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఇద్దరు యువతులను తీసుకు వచ్చి ఆన్ లైన్ లో విటులను సంప్రధించి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న నిందితుడిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసు అధికారుల కథనం మేరకు వేరే రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులను కలిసిన చంద్రశేఖర్ (32) అనే వ్యక్తి వారికి రూ. వేల రూపాల జీతం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బెంగళూరు తీసుకు వచ్చాడు. తరువాత బెంగళూరులోని శ్రీమంతులు ఎక్కువగా నివాసం ఉండే ఆర్ ఎంవీ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

ఇద్దరు యువతులను ఆ ఇంటిలో నిర్బంధించాడు. ఆన్ లైన్ లో విటులను సంప్రదించి వారిని అక్కడకు పంపించి యువతులను బెదిరించి వారి దగ్గర వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ దందాకు గీతా అనే మహిళ పూర్తి సహకారం ఇచ్చింది. యువతులు బయటకు వెళ్లకుండా గీతా జాగ్రత్తలు తీసుకుంది.
స్థానికులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు నిఘా వేశారు. విటులు ఇంటిలోకి వెళ్లిన సమయంలో దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను పునరావాస కేంద్రాలకు తరలించామని పోలీసులు అన్నారు. గీతా పరారీలో ఉందని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications