దెబ్బకు దెబ్బ: బంగ్లాదేశ్ రాయబారికి భారత్ సమన్లు..వివాదమేంటి..?

భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు గాడి తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది.రెండు దేశాల సరిహద్దు వద్ద ఫెన్సింగ్ వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇండియా బంగ్లాదేశ్ మధ్య 4156 కిలోమీటర్ల మేరా ఉన్న సరిహద్దు వద్ద భారత్ ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్‌ నిర్మాణం చేప్పట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు రావడంతో ఆదివారం రోజున బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ భారత రాయబారి ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజే అంటే సోమవారం రోజున భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ నూరల్ ఇస్లాంకు సమన్లు జారీ చేసింది.

ఇరు దేశాల సరిహద్దు కార్యకలాపాలను నియంత్రించే ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. దీన్ని బంగ్లాదేశ్ ఉల్లంఘిస్తోందనే వాదన భారత్ చేస్తోంది.ఆదివారం రోజన బంగ్లాదేశ్‌లోని భారత రాయబారి ఆదివారం స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఢాకాలోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి చేరుకుని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జషీం ఉద్దీన్‌తో 45 నిమిషాల పాటు సమావేమైనట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా బంగ్లాదేశ్ సంగ్బాద్ సంగష్ట స్పష్టం చేసింది.

Bangladesh Envoy Summoned India s Response to Dhaka s Recent Action

"భారత్ బంగ్లాదేశ్‌ సరిహద్దు వద్ద భద్రతా విషయంపై ఇరు దేశాల మధ్య మంచి అవగాహన ఉంది. ఇరు దేశాలకు చెందిన బీఎస్‌ఎఫ్, బీజీబీ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) మధ్య చక్కటి కమ్యూనికేషన్‌‌తో పాటు మంచి సంబంధాలున్నాయి. ఇదే అవగాహన ఇరు దేశాల మధ్య ఇకపై కూడా కొనసాగుతుందని, సరిహద్దు వద్ద చోటుచేసుకునే నేరాలపై రెండు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ అణిచివేసేందుకు ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నాను" అని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ పేర్కొన్నారు.

భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా బాగున్నాయి.అయితే ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం అనంతరం ఆమె దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందిన పరిణామాల దృష్ట్యా ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే షేక్ హసీనాను విచారణ చేయాలని వెంటనే బంగ్లాదేశ్‌కు పంపాలని ప్రస్తుతం ఉన్న మొహ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి తమకు అందిందని అయితే ఈ విషయంలో ఇప్పుడు ఏవిధంగానూ స్పందించలేమని స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ.

ఇప్పటికే మాజీ ప్రధాని షేక్ హసీనాను అరెస్టు చేయాలంటూ అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది. 2024 నవంబర్ ‌లో షేక్ హసీనా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన అల్లర్లలో ఆమె పార్టీకి మద్దతుగా నిలిచిన పలు పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారు. కొందరు దేశాన్ని విడిచి పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+