Banks: బ్యాంక్ ఖాతాదారులకు గమనిక.. మరోసారి కేవైసీ అప్డేట్ చేయాల్సి రావొచ్చు..!

బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు త్వరలో మరోసారి కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి రావొచ్చు. ఖాతాలు, ఖాతాదారులను గుర్తించడానికి అదనపు ధృవీకరణ కోసం కేవైసీ అప్డేట్ చేయాల్సి రావొచ్చని అధికారులు చెబుతున్నారు. కేవైసీ వ్యవస్థను పటిష్టం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చొరవ తీసుకుంటోంది. ప్రత్యేకించి ఒకే ఫోన్ నంబర్ తో ఉన్న వివిధ ఖాతాలు లేదా ఉమ్మడి ఖాతాలు ఉన్నవారు మరోసారి కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి రావొచ్చు.

కేవైసీ నిబంధనలను ప్రామాణీకరించడానికి, నిర్ధారించడానికి ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వ్యక్తుల నుంచి బ్యాంకులకు మరింత ధృవీకరణ అవసరమని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖాతాల కోసం పాన్, ఆధార్, ప్రత్యేక మొబైల్ నంబర్ (UMN) వంటి బహుళ-స్థాయి ద్వితీయ ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించడాన్ని తాము పరిశీలిస్తున్నాము ఒక సీనియర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లు సమాచారం.

Bank customers may need to update KYC once again

ఆధార్, ఓటరు ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఎన్ఆర్ఈజీఏ కార్డుల్లో ఏదో ఒక పత్రంతో బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. ఇందులో ఏది ఉపయోగించి బ్యాంక్ ఖాతా తెరిచినాపాన్‌, ఆధార్‌, యునిక్‌ మొబైల్‌ నంబర్‌ (UMN) వంటి వాటితో సెకండరీ వెరిఫికేషన్‌ చేయాలి. ఈ సెకండరీ ఐడెంటిఫైయర్‌లు ఒక వ్యక్తి వివిధ ఖాతాలను లింక్ చేయకపోతే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.

గత నెలలో ఫైనాన్స్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (FSDC) ఏకరీతి కేవాసీ నిబంధనలు, కేవైసీ రికార్డుల అంతర్-వినియోగం, కేవైసీ ప్రక్రియ సరళీకరణ, డిజిటలైజేషన్ గురించి చర్చించింది. ఫిన్ టెక్ సంస్థలు సంస్థలు అనుసరిస్తున్న కేవైసీ నిబంధనల పట్ల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్థలలో కొన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదించడం లేదని, ఇది క్రెడిట్ బ్యూరో డేటాపై ఆధారపడే ఇతర రుణదాతలకు ప్రమాదాన్ని పెంచుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+