Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె... డిమాండ్స్ ఇవే!!

బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు . రెండు ప్రభుత్వ రంగ రుణదాతలైన బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ చర్యకు నిరసనగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు నేటి నుంచి రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించనున్నారు.

నిరసన తెలుపుతున్న బ్యాంకర్స్ యూనియన్స్ ఇవే

నిరసన తెలుపుతున్న బ్యాంకర్స్ యూనియన్స్ ఇవే

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు డిసెంబర్ 16 మరియు 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె జరుగుతోంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేది ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్‌తో సహా తొమ్మిది యూనియన్ల గొడుగు సంస్థ. ఇక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సభ్యులు మేరకు ప్రస్తుతం బ్యాంకర్ల సమ్మె కొనసాగుతుంది.

 ప్రధాన డిమాండ్లు ఇవే

ప్రధాన డిమాండ్లు ఇవే

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సై అన్న విషయం తెలిసిందే. 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) ప్రైవేటీకరణను చేపట్టాలని తన ఉద్దేశాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో ఈ పార్లమెంట్ సెషన్‌లో బ్యాంక్ ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, 2021)ని ప్రభుత్వం ప్రవేశపెట్టకూడదని యూనియన్ కోరుతోంది. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021 ఉపసంహరించుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని ఈ ఆందోళన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు నష్టం

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు నష్టం

బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే బలహీన వర్గాలకు రుణ లభ్యత తగ్గుతుందని, కోట్లాది మంది ప్రజల డిపాజిట్లు రిస్క్ లో పడతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. దేశంలో సామాన్య ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండటం అవసరమని బ్యాంకర్ల యునైటెడ్ ఫోరం పేర్కొంటోంది. 1969లో బ్యాంకులను జాతీయం చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో ఉన్నవారికి బ్యాంకుల సేవలు అందాయని వారు గుర్తు చేస్తున్నారు. 1969లో 8 వేలుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాలంటే అవి ఎంతగా అభివృద్ధి చెందాయో అర్థం చేసుకోవచ్చని వారు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్ధవంతంగా పని చేయలేదని నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ, బ్యాంకులను ప్రైవేటీకరించడానికి కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

 బ్యాంకు ఉద్యోగుల ప్రభావం... నాలుగు రోజుల పాటు లావాదేవీలకు బ్రేక్

బ్యాంకు ఉద్యోగుల ప్రభావం... నాలుగు రోజుల పాటు లావాదేవీలకు బ్రేక్

బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు గురువారం మరియు శుక్రవారం నాడు మూసివేయబడతాయి . తర్వాతి రెండు రోజులు వారాంతాల్లో ఉన్నందున, ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు లావాదేవీలు తప్పకుండా మూసివేయబడతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా చాలా బ్యాంకులు చెక్ క్లియరెన్స్ మరియు ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి బ్యాంకింగ్ కార్యకలాపాలపై సమ్మె ప్రభావం గురించి ఇప్పటికే తమ కస్టమర్లను హెచ్చరించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+