ప్రేయసిని, కూతురిని చంపేసిన బ్యాంకు మేనేజర్
కోల్‌కతా: ప్రేయసిని, ఆమె కుమార్తెను దారుణంగా హత్య చేసి తప్పించుకుని జల్సాగా తిరుగుతున్న బ్యాంకు మేనేజర్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. సమరేష్ సర్కార్ (45) అనే వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లోని షెరాపులి సమీపంలోని దుర్గాపూర్ ప్రాంతంలోని ఒక బ్యాంకులో సమరేష్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య, పిల్లలు పశ్చిమ బెంగాల్ లోని తిటాగడ్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఉద్యోగ రీత్యా ఇతను దుర్గాపూర్ లో నివాసం ఉంటున్నాడు.
దుర్గాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సుచేత చక్రవర్తి (34) అనే గృహిణితో సమరేష్ అక్రమం సంబంధం సాగించాడు. అప్పటికే సుచేతకు ఐదు సంవత్సరాల పాప ఉంది. అయితే ఈ మద్య కాలంలో సుచేత తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది.

అయితే భార్యకు భయపడిన సమరేష్ సుచేతకు నచ్చ చెప్పుకుంటు వచ్చాడు. అయితే ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రియురాలిని అంతం చెయ్యాలని ప్లాన్ వేశాడు. 10 రోజుల క్రితం ఇంటికి వెళ్లిన సమరేష్ అనుమానం రాకుండా ప్రవర్తించాడు.
పెళ్లి చేసుకుంటానని సుచేతకు చెప్పాడు. తరువాత సుచేత, ఆమె కుమార్తె నిద్రపోతున్న సమయంలో కత్తి తీసుకుని దాడి చేశాడు. సుచేతను, ఆమె కుమార్తె (5)ను హత్య చేశాడు. ఇద్దరి మృతదేహాలను రెండు సూట్ కేసులలో పెట్టాడు.
గుట్టు చప్పుడు కాకుంాడ రెండు సూట్ కేసులు తీసుకు వెళ్లి గంగానదిలో విసిరేశాడు. స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి సమరేష్ ను అరెస్టు చేశారు. గంగా నదిలో తల్లి, కుమార్తె మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. సమరేష్ ను 12 రోజులు కస్టడికి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications