రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె, ఎప్పుడంటే?
న్యూఢిల్లీ:తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. మే 30, 31 తేదిల్లో రెండు రోజు పాటు సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు.
వేతనాల సమీక్ష విషయంలో యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ , ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కు మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు 48 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న సుమారు పది లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.

ఇప్పటికే బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల విషయమై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ తో చర్చల విఫలమైన సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేశాయి.
కానీ, స్పందన రాని కారణంగా సమ్మెకు దిగాలని బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల నేతలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 30న ఉదయం 6 గంటల నుంచి మే 31వ సాయంత్రం 6 గంటల వరకు ఈ సమ్మె నిర్వహిస్తామని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ప్రకటించాయి. . ఇప్పటికే తాము సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులిచ్చామని తెలిపారు.












Click it and Unblock the Notifications