బ్యాంకుల ‘బూస్ట్’, రికార్డ్‌ స్థాయిల్లో స్టాక్ మార్కెట్లు! దూసుకుపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ!

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు అత్యంత భారీ స్ఠాయిలో రూ. 2.11 లక్షల కోట్ల పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి.

దీంతో స్టాక్‌మార్కెట్లు రికార్డ్‌ స్థాయిలను నమోదు చేశాయి. గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న బ్యాంక్‌ నిఫ్టీ కూడా రికార్డ్‌ స్థాయిని తాకింది. సెన్సెక్స్‌ 33 వేల స్థాయిని, నిఫ్టీ 10,300 స్థాయిని దాటేసింది.

Banking booster: Sensex, Nifty hit fresh record highs; PNB, BoB, SBI top gainers

పీఎన్‌బీ 40 శాతం ఎగిసి టాప్‌ విన్నర్‌గా నిలిచింది. వరుసగా మూడవ సెషన్‌లో కూడా లాభపడిన పీఎన్‌బీ ఆల్‌ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని దిగ్గజ బ్యాంకులు 52 వారాల గరిష్టం వద్ద ఉన్నాయి.

ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ లాంటి ప్రభుత్వం బ్యాంక్‌ షేర్లతోపాటు ప్రయివేటు బ్యాంక్‌ దిగ్జజం ఐసీఐసీఐ, యాక్సిస్‌తో పాటు ఇతర చిన్న బ్యాంకుల షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లో దూకుడు కొనసాగుతోంది.

అయితే ఎస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ , హెచ్డ్‌ఎఫ్‌సీ నష్టపోతున్నాయి. అటు రిలయన్స్‌, ఇండియా బుల్స్‌ ఫైనాన్స్‌, ఐడియా నష్టపోతున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 500 పాయింట్లు లాభపడిందంటే మార్కెట్‌ ఎంత జోరుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిఫ్టీ కంటే సెన్సెక్స్‌ దూకుడుగా ఉంది. ప్రస్తుతం నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 10,262 వద్ద.. సెన్సెక్స్‌ 273 పాయింట్ల లాభంతో 32,881 వద్ద ట్రేడవుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The announcement of Rs 2.1 lakh crore-PSU bank recapitalisation plan and a big Rs 7 lakh crore boost to road building drove Dalal Street bulls as they pushed the benchmark indices to record high at opening bell on Wednesday. PSU banking stock hit the roof, with the largest lender SBI zooming 24 per cent, PNB 48.19 % 21 per cent and Bank of Baroda 31.68 % gaining 20 per cent. At opening, Sensex climbed nearly 500 points to hit 33,000 mark for the first time ever. Nifty50 soared over 100 points to cross 10,300 level, also the first in history. Market breadth remained totally skewed in favour of bulls.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి