Banks: బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తం లేనందకు రూ.35 వేల కోట్ల ఛార్జీలు వసూలు చేశారు..
అప్పుడప్పుడు మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్ కు వెళ్తోంది. మనం డబ్బు ఖాతాలో జమ చేయగానే.. మైనస్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత కట్ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుందని బ్యాంకు అధికారులను అడిగితే కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయనందుకు జరిమానా విధించినట్లుగా చెబుతున్నారు. ఇలా మినీమ్ బ్యాలెన్స్ మెయింట్ చేయనందుకు ఛార్జీలు విధిస్తారు. అలాగే ఏటీఎం లావాదేవీ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ ఛార్జీలు కూడా తీసుకుంటారు.
కనీస బ్యాలెన్స్ లేనందుకు, ఏటీఎం ఛార్జీలు, ఎస్సెమ్మెస్ ఛార్జీలన్నీ కలిపి 2018 నుంచి ఇప్పటి వరకు రూ.35,000 కోట్లకు పైగా బ్యాంకులు వసూలు చేశాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థక శాఖ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐదు ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్ల నుంచి ఈ భారీ సొమ్మును వసూలు చేశారు. దీన్ని బట్టి ప్రజలు భారీగా సొమ్మును కోల్పొతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బ్యాంకులతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకులు తమ వినియోగదారులు కనీస మొత్తాన్ని తమ అకౌంట్ లో ఉంచనందున డబ్బులు వసూలు చేశాయి.

ఇలా రూ.21 వేల కోట్లు ఛార్జ్ చేశాయి. ఏటీఎం ఛార్జీలు రూ.8,000 కోట్లు, ఎస్సెమ్మెస్ ఛార్జీలు రూ.6 వేల కోట్లు వసూలు చేశాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో కనీస మొత్తం తక్కువగా ఉంటాయి. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతాయి. రూరల్ లో తక్కువగా ఉంటుంది. అర్బన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో కనీస మొత్తం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా ప్రాంతాన్ని బట్టి కనీస మొత్తాలు మారుతుంటాయి. బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తం మెట్రో నగరాల్లో అయితే రూ.3000 నుంచి రూ.10000 వరకు ఉంటుంది.

టైర్ 2 నగరాల్లో రూ.2 వేల నుంచి రూ.5 వేలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. ఈ ఛార్జీలన్నీ బ్యాంకును బట్టి మారుతాయి. కానీ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలు వసూలు చేయరు.












Click it and Unblock the Notifications