చోట రాజన్ శిష్యుడు బన్నంజే రాజ విచారణ

ఉడిపి: మాఫియా డాన్ బన్నంజే రాజను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి అతనిని కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి తీసుకు వెళ్లారు. మాఫియా ముఠా నాయకుల వలన ప్రాణహాని ఉండటంతో అతనికి మరింత భద్రత కల్పించారు.

మాఫియా ముఠా నాయకుడు బన్నంజే రాజను బెల్గాం కోర్టులో హాజరు పరిచారు. బన్నంజే రాజను విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులు మనవి చేశారు. ఈ నెల 28వ తేది వరకు బన్నంజే రాజను విచారణ చెయ్యడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

ప్రత్యేక కాన్వాయ్ లో బెల్గాం నుండి బన్నంజే రాజను ఉడిపి తీసుకు వెళ్లారు. తరువాత ఉడిపిలోని రహస్య ప్రాంతంలో బన్నంజే రాజను విచారణ చేస్తున్నారు. బన్నంజే రాజ మీద ఒక కర్ణాటకలోనే 44 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

రెండు కేసులకు సంబంధించి అతనిని ఉడిపికి తీసుకువెళ్లారు. ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రై, విదేశాలలో తలదాచుకున్న మాఫియా ముఠా నాయకుడు రవి పూజారి వలన తనకు ప్రాణాహాని ఉందని బన్నంజే రాజ ఆరోపించాడు.

Bannanje Raja had been handed over to police custody for 15 days
చోటా రాజన్ శిష్యుడు

కర్ణాటకలోని ఉడిపి జిల్లా బన్నంజ్ గ్రామానికి చెందిన రాజ అలియాస్ బన్నంజే రాజ బీఏ చదివాడు. 1990వ సంవత్సరంలో ఉడిపిలోని పూర్ణప్రజ్ఞ కాలేజ్ లో చదువుకునే సమయంలో సాటి విద్యార్థి చెప్పిన మాట వినలేదని కాలేజ్ భవనం మీద నుండి కిందకు తోసి హత్య చేశాడు.

ఈ విధంగా నేర చరిత్రను ప్రారంభించిన బన్నంజే రాజ తరువాత అనేక క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ముంబైలోని గ్యాంగ్ స్టర్ల దగ్గర పేరు సంపాధించాడు. తరువాత ముంబైకి మకాం మార్చాడు. చోట రాజన్ బ్యాచ్ లో చేరిపోయాడు.

చోట రాజన్ కు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత అడ్డుఅదుపు లేకుండ నేరాలు చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. 20015 ఫిబ్రవరి నెలలో విదేశాలలో బన్నంజే రాజను అరెస్టు చేసి తీసుకు వచ్చారు. అనేక వ్యాధులతో బాధపడుతున్న బన్నంజే రాజ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+