వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాతాదారుల ఇంటి వద్దే రద్దుచేసిన నగదు నోట్ల మార్పిడి

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై : దేశవ్యాప్తంగా తమ వద్ద ఉన్న పెద్ద నగదునోట్లను మార్పిడి చేసుకొనేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. కాని, తమిళనాడు రాష్ట్రంలోని తిరుమళ్ళూరు జిల్లాల్లో మాత్రం ప్రజలంతా నిశ్చింతగా తమ ఇళ్ళ వద్దే ఉంటున్నారు. ప్రజల వద్దకు పాలన తరహాలో ఇళ్ళ వద్దక0 బ్యాంకు అధికారులు వచ్చి మరీ ప్రజలకు పెద్ద నగదునోట్లను మారుస్తున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న జనాన్ని చూస్తున్నాం. కాని, తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో బ్యాంకు అధికారులు తీసుకొన్న నిర్ణయం కారణంగా ప్రజలు నిశ్చింతంగా ఉన్నారు. తమ ఇళ్ళ వద్దకే బ్యాంకు ఉద్యోగులు వచ్చి మరీ నగదు మార్పిడి చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు బ్యాంకు అధికారులు మంచి ఆవకాశం ఇచ్చారు. బ్యాంకు వద్దకు ఖాతాదారులు ఎవరూ రాకూడదని బ్యాంకు అధికారులు కోరారు.అంతేకాదు బ్యాంకు ఉద్యోగులనే ఖాతాదారుల వద్దకు పంపుతున్నారు బ్యాంకు అధికారులు.

banned currency exchange at doorstep in tamilnadu

ఆదివారం నాడు పుంగత్తూరు గ్రామంలో ఇండియన్ బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు డబ్బు మార్పిడి చేశఆరు. రద్దు చేసిన నగదు నోట్లను తీసుకొని వాటి స్థానంలో చిన్న నగదు నోట్లను ఖాతాదారులకు అందించారు. ఇంటివద్దకే వచ్చి బ్యాంకు అధికారులు నోట్లను మార్పిడి చేస్తున్న కారణంగా ఖాతాదారులు తమ పనులకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

English summary
ank employees bumper offer in tamilnade state. bank employees start currency exchange at the customers houses on sunday in pungattur village .all over the thiruvulluru district bank employees exchange currency at customers houses begin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X