డాక్టర్‌గా.. ప్రొఫెసర్‌గా..: 3సార్లు ప్రయత్నించిన శివసేన ఎంపీ, కానీ
విమాన సంస్థలు తనకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. విమాన టిక్కెట్ కోసం ఆయన మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
ముంబై: విమాన సంస్థలు తనకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. విమాన టిక్కెట్ కోసం ఆయన మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఎయిరిండియా ఉద్యోగిపై చేయి చేసుకున్నాడన్న కారణంగా ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పేరును పలు విమానయాన సంస్థలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రవీంద్ర తెలివిగా తన పేరును మూడుసార్లు మార్చుకుని విమానంలో ప్రయాణించాలనుకున్నారట.
ఈ గొడవ జరిగిన వారం రోజుల తర్వాత ఎయిరిండియా కాల్ సెంటర్‌కి గైక్వాడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రవీంద్ర గైక్వాడ్ పేరిట ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఏఐ 806 విమానానికి టికెట్ కావాలని అడిగాడు. ఇందుకు సిబ్బంది ఒప్పుకోలేదు.

దీంతో రెండో సారి ప్రొఫెసర్ వి రవీంద్ర గైక్వాడ్ పేరిట హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి టికెట్ కావాలన్నారు. ఆ టికెట్ కూడా రద్దు చేశారు. ఇక మూడోసారి ప్రొఫెసర్ రవీంద్ర గైక్వాడ్ పేరిట నాగ్‌పూర్ నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వెళ్లే విమాన టికెట్ కావాలని ఓ ట్రావెల్ ఏజెంట్‌కి ఫోన్ చేశారు.
దాంతో ట్రావెల్ ఏజెంట్ వెంటనే ఎయిరిండియా ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించాడు. గత గురువారం బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వనందుకు ఎయిరిండియా ఉద్యోగిని గైక్వాడ్ చెప్పుతో కొట్టారు. టిక్కెట్ కోసం గైక్వాడ్ తన హోదాల్లో, పేర్లలో మార్పులు చేసుకున్నా ఫలితం దక్కలేదు. మరోవైపు, గైక్వాడ్‌పై విమాన సంస్థల బ్యాన్ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని శివసేన కోరుతోంది.












Click it and Unblock the Notifications