కేంద్రానికి అల్టిమేట్ వార్నింగ్ -ట్రాక్టర్లే యుద్ధ ట్యాంకులు -బారికేడ్లు బద్దలు కొట్టుడే: టికాయత్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు కేంద్రానికి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. తమ తదుపరి ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం గనుక బారికేడ్లను ఏర్పాటు చేస్తే వాటిని బద్దలు కొడతామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. అంతేకాదు..

సాగు చట్టాలపై పోరులో ట్రాక్టర్లే రైతుల యుద్ధ ట్యాంకులని, తదుపరి నిరసనల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తే యుద్ధ ట్యాంకులైన ట్రాక్టర్లతోనే అడ్డుకోవాలని టికాయత్ పిలుపునిచ్చారు. మూడు చట్టాలు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు శుక్రవారం నాటికి 99వ రోజుకు చేరాయి. ఉద్యమాన్ని సుదీర్ఘకాలం కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈక్రమంలో..

Barricades will be broken during next andolan; tractors are farmers tanks: Tikait

నిరవధిక నిరసనల కోసం ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్‌ 15 మంది రైతులను రప్పించేలా భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించామని టికాయత్ వెల్లడించారు. కార్పొరేట్ల ఆటబొమ్మగా మోదీ సర్కార్‌ వ్యవహరిస్తోందని, కార్పొరేట్‌ వ్యాపారులు చెప్పిందే మోదీ సర్కార్‌ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతులతో చర్చలకు స్పష్టమైన ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కాగా,

మార్చి 6(శనివారం) నాటికి తమ పోరాటం 100వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా రైతులు భారీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కుండ్లి- మానేసర్‌ - పల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను శనివారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల దిగ్బంధించనున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలవాలని, ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు సందర్శించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా రైతులు ప్రచారం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+